INDIA-AMERICA: 'టెన్షన్ పడొద్దు.. మాట్లాడతాం.. మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తాం...అప్పటివరకు సైలెన్స్ ప్లీజ్'
INDIA-AMERICA: అమెరికా నిర్ణయం తాత్కాలికంగా ఒత్తిడిని తెచ్చినా, దీని మధ్యే భారత్ వ్యాపార అవకాశాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వ్యూహాత్మక లాభాలు ఎలా పొందాలో అనే అంశంపై ఇప్పుడు కేంద్రం దృష్టి పెట్టింది.

INDIA-AMERICA: 'టెన్షన్ పడొద్దు.. మాట్లాడతాం.. మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తాం...అప్పటివరకు సైలెన్స్ ప్లీజ్'
INDIA-AMERICA: అమెరికా తాజా టారిఫ్ దెబ్బకు భారత్ తీవ్రతరంగా స్పందించనుంది. న్యూఢిల్లీలోని అధికార వర్గాల మాటల ప్రకారం... అమెరికా విధించిన రెసిప్రోకల్ టారిఫ్‌ల ప్రభావాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఎగుమతిదారులను కాపాడటానికి అవసరమైన అన్ని మార్గాలపై ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి.
ఇటీవల ట్రేడ్ వార్ నేపథ్యంలో అమెరికా కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలు పెంచగా, కేంద్ర వాణిజ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని, సెప్టెంబర్ నాటికి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు కూడా ఉండవచ్చని సమాచారం. భారత్‌కు ఈ విషయంలో కొన్ని ప్రత్యేక అవకాశాలు ఉన్నాయనీ, ఇతర దేశాలతో పోల్చితే భారత్‌కు ముందస్తు అంచనాలు ఉన్నాయని అంటున్నారు అధికారులు. "వాషింగ్టన్ నుండి నేరుగా ఢిల్లీకి వచ్చిన దౌత్యప్రయాణం ఒక కీలక సంకేతంగా మారినట్లు" అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది ఇండియాకు చర్చల్లో అనుకూల దిశగా మారే అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు.
ఇక ఈ పరిణామాలు భారత్‌కు వ్యాపార విస్తరణలో కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయని అంచనా. అంతర్జాతీయ సరఫరా గొలుసులు ఇప్పుడు తిరిగి పునఃవ్యవస్థీకరణలోకి వెళ్తుండటంతో, భారత్ మరో కీలక ఆటగాడిగా ఆవిర్భవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా టారిఫ్‌లకు ప్రతిస్పందనగా అనేక దేశాలు కొత్త ట్రేడ్ బ్లాకుల గురించి ఆలోచిస్తుండగా, భారత్ కూడా వాటితో చర్చలు జరుపుతోంది.