వాహనదారులకు గుడ్ న్యూస్: కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం!
కరోనావైరస్ ను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనావైరస్ ను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ , ఫిట్నెస్ పత్రాలు వంటివి 2020 సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రవాణాదారులు మరియు పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించడానికి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ ద్వారా ఈ సమాచారం ఇచ్చారు. అంతకుముందు, మార్చి 30 న, కరోనా సంక్షోభం కారణంగా, రవాణా మంత్రిత్వ శాఖ ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనాల రిజిస్ట్రేషన్ ప్రామాణికతను జూన్ 30 వరకు పొడిగించింది. తాజాగా దీనిని సెప్టెంబర్ 30 వరకు చెలుబాటు చేసేలా ఆదేశాలు జారీ చేసింది.