Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ వరదలు

బీభత్సం సృష్టిస్తోన్న వరదలు రెండురోజుల వ్యవధిలో 9 మంది మృతి.. ఎనిమిది మంది గల్లంతు

Update: 2021-07-14 12:04 GMT

హిమాచల్ ప్రదేశ్ లో వరదలు (ఫైల్ ఫోటో)

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో రెండు రోజుల వ్యవధిలో 9 మంది మరణించారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వరదల వల్ల రాష్ట్రంలో 142 రోడ్లు కొట్టుకుపోయాయని రెవెన్యూశాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా కులూ జిల్లాలో వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. జిల్లాలోనే 25 ప్రధాన రోడ్లు ధ్వసమయ్యాయని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ దళాలను కేంద్రం పంపంచింది. పరిస్థితిని కేంద్ర హోంశాఖ ఎప్పిటికప్పుడు సమీక్షిస్తున్నాదని వెల్లడించింది.

Tags:    

Similar News