Terror Attack at Pahalgam: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి... ఐదుగురు టూరిస్టులకు గాయాలు

Kashmir terror attack news: వేసవి సీజన్‌లో కాశ్మీర్‌కు వచ్చే టూరిస్టుల సంఖ్య భారీగా ఉంటుంది. మరోవైపు అమర్‌నాథ్ యాత్రకు...

Update: 2025-04-22 11:31 GMT
terror attack

terror attack

  • whatsapp icon

Pahalgam Terrorists Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు పర్యాటకులు గాయపడ్డారు. పహల్‌గామ్‌లోని బైశారన్ లోయలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న భద్రత బలగాలు డాక్టర్ల బృందంతో అక్కడికి చేరుకున్నాయి.

పహల్‌గామ్ కాశ్మీర్ లోయలో అందమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడి అభయారణ్యాలు, తేటని నీటితో నిండిన సరస్సులు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. వేసవి సీజన్‌లో కాశ్మీర్‌లో పర్యటించే టూరిస్టుల సంఖ్య భారీగా ఉంటుంది. అంతేకాకుండా దేశం నలుమూలల నుండి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు ప్రస్తుతం తమ పేర్లు రిజిస్టేషన్ చేసుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పర్యాటకులపై దాడి జరగడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. కాశ్మీర్ సందర్శించేందుకు వచ్చే పర్యాటకులను భయబ్రాంతులకు గురిచేసి తద్వారా పర్యాటక రంగానికి వచ్చే ఆదాయాన్ని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసమే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేత వికార్ రసూల్ వని ఆందోళన వ్యక్తంచేశారు.

అమర్‌నాథ్ యాత్ర వివరాలు

జులై 3 నుండి అమర్‌నాథ్ యాత్ర మొదలుకానుంది. 38 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. దేశం నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు అమర్‌నాథ్‌లో మంచు లింగాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. అమర్‌నాథ్ యాత్రకు వచ్చే భక్తులను రెండు మార్గాల్లో అనుమతిస్తుంటారు. ఒకటి అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్‌గామ్ మీదుగా వెళ్లే 48 కిమీ మార్గం కాగా మరొకటి గందర్బల్ జిల్లాలోని బల్తల్ మార్గం. రెండో మార్గం కేవలం 14 కిమీ మాత్రమే ఉంటుంది కానీ కొండలు, లోయలు దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. దారి పొడవునా అతి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు సర్వసాధారణం. కానీ ఎక్కువ సందర్భాల్లో భారత భద్రతా బలగాలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతుంటాయి. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టడం జరుగుతోంది. కానీ ఈసారి పర్యాటకులే లక్ష్యంగా దాడికి పాల్పడటంపై కేంద్రం మరింత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News