Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా..? కంగారు పడకండి.. కారణమిదే
Emergency Alert: విపత్తుల సమయంలో అప్రమత్తం చేసేందుకు..
Emergency Alert: మీ మొబైల్ ఫోన్లకు ఓ రకమైన అలర్ట్ టోన్ వచ్చిందా..? అది గమనించారా..? ఓ కొత్త శబ్దం.. వైబ్రేషన్‌తో మీ ఫోన్ కి వచ్చిన అలర్ట్ టోన్‌తో కలవరపడ్డారా..? మరేం కంగారు లేదు. అది కేంద్రం ఇచ్చిన ఎమర్జెన్సీ అలర్ట్ టోన్. ఈ సందేశం అత్యవసర పరిస్థితిని ఏమీ సూచించట్లేదు. ట్రయల్ రన్ ప్రాసెస్‌లో భాగంగా విపత్తు నిర్వహణ విభాగం నుంచి వచ్చిన ఓ సందేశం మాత్రమే.
దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో ఇవాళ ఎమర్జెన్సీ అలర్ట్ మోగింది. కాసేపటి వరకు ఆ అలారం మోగుతూనే ఉండటంతో యూజర్లంతా కంగారు పడ్డారు. ఒక్కసారిగా అన్ని ఫోన్ల నుంచి అలారం మోగడం.. ఆపే వరకు ఆ అలారం మోగుతూనే ఉండటం... అసలు ఫోన్ అలా ఎందుకు మోగుతుందో తెలియని అయోమయంతో యూజర్లు టెన్షన్ పడ్డారు. అయితే విపత్తు నిర్వహణను మరింత పకడ్బందీగా.. ప్రజల భద్రత, అత్యవసర సమయంలో వారిని రీచ్ అయ్యేందుకు కేంద్రం ఈ అలర్ట్ విధానాన్ని ప్రారంభిస్తోంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్‌లో భాగంగానే అందరికీ అలర్ట్ పంపింది టెలి కమ్యూనికేషన్ విభాగం. ఇది కేవలం టెస్టు కోసం మాత్రమే అని.. మీ నుంచి ఎలాంటి స్పందన అవసరం లేదంటూ మొబైల్ ఫోన్లలో మెసేజ్ డిస్‌ప్లే చేసింది. ఇలాంటి అలర్ట్‌ను విపత్తుల సమయంలో అప్రమత్తం చేసేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది.