గర్భిణీ ఏనుగును చంపిన కేసులో ఒకరి అరెస్టు
దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించిన గర్భిణీ ఏనుగును చంపిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు కేరళ అటవీ శాఖ మంత్రి కె.రాజు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించిన గర్భిణీ ఏనుగును చంపిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు కేరళ అటవీ శాఖ మంత్రి కె.రాజు తెలిపారు.ఏనుగును దారుణంగా హత్య చేసిన కేసులో ఈ వ్యక్తి మాత్రమే కాదు, ఎక్కువ మంది పాల్గొన్నారని, మిగతావారిని పట్టుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ తదుపరి దర్యాప్తు జరుపుతున్నారని మంత్రి చెప్పారు.
పేలుడు పదార్థాలతో నింపిన పైనాపిల్ తిని గర్భిణీ ఏనుగు మరణించిన సంఘటనపై ముగ్గురు నిందితులు స్కానర్‌లో ఉన్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కాగా సైలెంట్ వ్యాలీ ఫారెస్ట్‌లో శక్తివంతమైన ఫైర్ క్రాకర్స్‌తో నిండిన పైనాపిల్‌ను 15 ఏళ్ల ఏనుగు తిన్నట్లు అనుమానిస్తున్నారు.. ఇది ఒక వారం తరువాత వెల్లియార్ నదిలో మరణించింది.
ఈ సంఘటనపై పౌర సమాజం తోపాటు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించడంతో, ఇది కేరళలో రాజకీయ మలుపు తీసుకుంది. ఈ సంఘటనపై కేరళ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కేంద్ర మంత్రులతో సహా పలువురు ప్రయత్నిస్తున్నారని విజయన్ అన్నారు. ఏనుగు హత్యకు బిజెపి మతపరమైన రంగు ఇచ్చిందని కాంగ్రెస్ గురువారం ఆరోపించింది. ఈ అంశంపై బిజెపి నాయకులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని అన్నారు.