Delhi Liqour Scam: లిక్కర్ స్కామ్ కోసం జరిగిన సమావేశాల్లో పిళ్లై పాల్గొన్నారు
Delhi Liqour Scam: పిళ్లై విచారణకు సహకరించడంలేదన్న ఈడీ
Delhi Liqour Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఈ కేసులో ఈడీ మరొకరిని అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2 రోజుల పాటు పిళ్ళైని విచారించిన అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం అరుణ్ పిళ్లైను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. పిళ్ళై విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు ఈడీ తరఫు న్యాయవాదులు. ఇండో స్పిరిట్ లో పిళ్లై భాగస్వామిగా ఉన్నారన్నారు. లిక్కర్ పాలసీ కోసం జరిగిన సమావేశాల్లో పిళ్లై పాల్గొన్నారని, సమీర్ మహేంద్రుడుతో కలిసి పిళ్లై లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిళ్లైని ఏడురోజుల కస్టడీకి కోరారు ఈడీ అధికారులు. అరుణ్ పిళ్ళై , బుచ్చిబాబులను కలిపి విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు.. కాసేపట్లో ఉత్తర్వులు ఇవ్వనుంది.