కేఫ్ కాఫీ డే' వీజీ సిద్ధార్థ కుమారుడితో డీకే ఐశ్వర్య వివాహం!

కర్ణాటక మాజీ మంత్రి, కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్, ‌కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు, దివంగత వీజీ సిద్ధార్థలు స్నేహితుల నుంచి వియ్యంకులు కాబోతున్నారు.

Update: 2020-06-04 14:40 GMT

కర్ణాటక మాజీ మంత్రి, కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్, ‌కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు, దివంగత వీజీ సిద్ధార్థలు స్నేహితుల నుంచి వియ్యంకులు కాబోతున్నారు. వీజీ సిద్ధార్థ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణించిన ఏడాది లోపు ఇంట్లో శుభకార్యం జరగాలని కుటుంబసభ్యులు భావించారు. ఈ క్రమంలో వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు వివాహం చేయబోతున్నారు. అమర్త్య హెగ్డేకు డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను ఇచ్చి వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు.

అమెరికాలో ఉన్నత చదువులు చదివిన అమర్త్య హెగ్డే తండ్రి నెలకొల్పిన కేఫ్ కాఫీ డే వ్యవహారాలు చూస్తున్నారు. ఇక డీకే శివకుమార్ పెద్ద కూతురైన ఐశ్వర్య (22) బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసి కుటుంబ వ్యాపారాలు చూస్తున్నారు.. అంతేకాదు బెంగళూరులోని శివకుమార్ యాజమాన్యంలోని గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీకి ఆమె ట్రస్టీ గా ఉన్నారు. కాగా కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడైన వీజీ సిద్ధార్థ 2019 జూలైలో మంగళూరులోని నేత్రావతి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News