నిరుద్యోగులకు సువర్ణవకాశం.. డిజిటల్‌ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు..

Digital India Recruitment 2022: ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి బంపర్ ఆఫర్.

Update: 2022-03-09 13:54 GMT

నిరుద్యోగులకు సువర్ణవకాశం.. డిజిటల్‌ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు.. 

Digital India Recruitment 2022: ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి బంపర్ ఆఫర్. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీల్లోని డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ (DIC).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టులని భర్తీ చేస్తుంది. ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు ఉంటాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, పోస్టుల సంఖ్య, ఎంపిక విధానం తదితర వివరాలు తెలుసుకుందాం.

పోస్టులు

ప్రోగ్రాం డైరెక్టర్‌ పోస్టులు 1, పోర్టర్‌ డైరెక్టర్‌ పోస్టులు1, ఫైనాన్స్‌ మేనేజర్‌ పోస్టులు1, మార్కెటింగ్‌ మేనేజర్‌ పోస్టులు 2, ప్రోగ్రాం మేనేజర్‌ పోస్టులు 5, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ పోస్టులు 1, పోర్టర్‌ మేనేజర్‌ పోస్టులు 1, ఫైనాన్స్‌ కో ఆర్డినేటర్‌ పోస్టులు 1, అడ్మిన్‌ స్టాఫ్‌ పోస్టులు 2 ఉన్నాయి.

పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ/సీఎఫ్‌ఏ/ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ మార్చి 17, 2022గా నిర్ణయించారు.

డిజిటల్ ఇండియాలో భాగంగా భారత్ ఓ బలోపేతమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలన్నది ప్రధాని మోడీ లక్ష్యం. డిజిటల్ లాకర్, ఈ-విద్య, ఈ-వైద్యం, వాణిజ్యం, పరిపాలన వంటి తదితర సేవలన్నీ డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. మొత్తం లక్షా 13 వేల కోట్ల పెట్టుబడులతో రెండున్నర లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి తగ్గింపు, సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకొని భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు డిజిటల్ ఇండియా ప్రాజెక్టుని ప్రారంభించారు. 

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News