ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్ నిజాలు
గర్భంతో ఉన్న ఏనుగు మరణం దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తిన సంగతి తెలిసిందే.
గర్భంతో ఉన్న ఏనుగు మరణం దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఏనుగు పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని శరీరంలో బుల్లెట్, ఇతర లోహాల అవశేషాలు కనిపించలేదని రిపోర్టు పేర్కొంది. అంతేకాదు ఏనుగు నోటిలో పేలుడు సంభవించటం కారణంగా తీవ్ర గాయాలు అయ్యాయి, దాని కారణంగా నోటి లోపల ఇన్‌ఫెక్షన్ సోకినట్లు తేలింది. ఈ ఇన్‌ఫెక్షన్ కారణంగానే విపరీతమైన నొప్పి రావడంతో ఆ ఏనుగు నీరు, ఆహారం తీసుకోలేకపోయిందని..
నీరు, ఆహరం లేకుండా సుమారు రెండు వారాల పాటు గడిపింది.. అయితే ఆ తరువాత నీరసానికి గురైన ఏనుగు నీళ్లలో మునిగిపోయిందని, ఈ క్రమంలో శరీరంలోకి పెద్ద మొత్తం నీరు చేరడంతో ఊపిరి తిత్తులు పాడయ్యి మరణించినట్లు వెల్లడైంది. కాగా గర్భంతో ఉన్న ఈ ఏనుగు వయసు దాదాపు 15 సంవత్సరాలు ఉంటుందని పేర్కొంది. కాగా ఏనుగు చావుకు కారణమైన కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఒకరిని అరెస్ట్ చేసినట్లు కేరళ అటవీశాఖ మంత్రి కె.రాజు మీడియాకు తెలిపారు.