No Confidence Motion: నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని బహిష్కరించిన విపక్ష ఎంపీలు
No Confidence Motion: విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే 270 ఓట్లు అవసరం
No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం తరపున సభలో మాట్లాడుతున్నారు. అయితే నిర్మలా ప్రసంగం జరుగుతుండగా.. సభ నుంచి వాకౌట్ చేశారు విపక్ష ఎంపీలు. నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని బహిష్కరించారు. ఇక సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని ప్రసంగం అనంతరం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో 332 మంది ఎంపీల మద్దతు ఉండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమికి 142 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది.