కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత..
తమిళనాడులోని డిఎంకె ఎమ్మెల్యే జె అన్బాజగన్ బుధవారం తెల్లవారుజామున మరణించారు, ఆయన ఇటీవల కరోనా భారిన పడ్డారు.
తమిళనాడులోని డిఎంకె ఎమ్మెల్యే జె అన్బాజగన్ బుధవారం తెల్లవారుజామున మరణించారు, ఆయన ఇటీవల కరోనా భారిన పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చేరిన దాదాపు వారం తరువాత మరణించారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ కు సన్నిహితుడైన ఎమ్మెల్యే జె అన్బాగగన్.. మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం అన్బాజగన్ తిరువల్లికేని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో డిఎంకె మాజీ అధ్యక్షుడు ఎం. కరుణానిధి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. తమిళనాడులో కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయక సామగ్రిని అందించేందుకు గాను ఎంకె స్టాలిన్ 'ఓండ్రినైవోమ్ వా' అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అన్బాగగన్ చురుకుగా పాల్గొన్నారు.
నెలరోజులపాటు ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన కరోనా భారిన పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చేరారు. అయితే సోమవారం ఆయన ఆరోగ్యం మరింతగా విషమించింది. బుధవారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి మరింతగా క్షీణించిందని రెలా ఇన్స్టిట్యూట్ , మెడికల్ సెంటర్ అధికారిక బులెటిన్ తెలిపింది. అన్బాజగన్ ఉదయం 8.05 గంటలకు మరణించినట్లు ప్రకటించారు ఆసుపత్రి సిబ్బంది ప్రకటన చేసింది. అంతేకాదు స్వయంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి బుధవారం ఉదయం తన ట్విట్టర్ లో ఎమ్మెల్యే అన్బాజగన్ మరణించినట్టు పేర్కొన్నారు. ఆయన మరణంతో డీఎంకే పార్టీ షాక్ లో మునిగిపోయింది.