నేడు మరోసారి అమిత్ షాతో జగన్ భేటీ!

6.30 నుంచి 7.30 గంటల వరకు హోం మంత్రి నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన..

Update: 2020-09-23 01:59 GMT

కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం ముందుగా అమిత్ షా నివాసానికి వెళ్లి ఆయనను కలిసారు. 6.30 నుంచి 7.30 గంటల వరకు హోం మంత్రి నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించినట్టు తెలిసింది. అలాగే విభజన చట్టంలోని హామీలు, పోలవరం ప్రాజెక్ట్ కు 2014 కు ముందు ఖర్చు చేసిన నిదుల తోపాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి విడుదల, మూడు రాజధానుల విషయంలో కేంద్ర హోం శాఖకు, హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ వంటి వివరాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే ఇంకా చర్చించాల్సిన విషయాలు పెండింగ్ లో ఉన్నందున నేడు మరోసారి అమిత్ షా తో సమావేశం కానున్నారు జగన్.. బుధవారం ఉదయం 10.30 గంటలకు మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ సమావేశం కానున్నట్టు ముఖ్యమంత్రి సన్నిహిత అధికార వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందు ఉదయం 9 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చెయ్యడానికి కావలసిన నిధులను ఆలస్యం చెయ్యకుండా విడుదల చెయ్యాలని కోరనున్నారు. కాగా సీఎం జగన్ వెంట ఎంపీలు వల్లభనేని బాలసౌరి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News