నేటితో ముగియనున్న చింతన్ శిబిర్ సమావేశాలు
Congress: నేడు ఉ. 11గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం
Congress: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్ శిబిర్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ ఉదయం 11గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. ఆరు కమిటీల సిఫార్సులపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ సమావేశంకానుంది. ఇక రాజకీయ, ఆర్థిక, సామాజిక, యువత, రైతు అంశాల తీర్మానాలపై సీడబ్ల్యూసీ ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ గాంధీ ప్రసగించనున్నారు. ఇక చివరిగా సోనియా గాంధీ ముగింపు ఉపన్యాసం చేయనున్నారు.