పీఠలపై కుప్పకూలిన పెళ్లి కూమార్తె..బాధితురాలి చెల్లెలితో వివాహం
Bride deceased heart attack: పెళ్లి జీవితంలో ఓ మధురానుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే సారి వచ్చే అతిపెద్ద పండగ ఇదే.
Bride deceased heart attack: పెళ్లి జీవితంలో ఓ మధురానుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే సారి వచ్చే అతిపెద్ద పండగ ఇదే. పెద్దల సమాక్షంలో వేదమంత్రాలు , మేళతాలాల మధ్య రెండు మనస్సులు ఒక్కటయ్యే శుభతరుణం కూడా ఇదే. కానీ ఇదే పెళ్లీ ఓ కుటుంబంలో విషాదం నింపింది. పెళ్లికి అంతా సిద్దమైన వేళ.. కానీ అంతలోనే విషాదం. పెళ్లి పందింట్లో పెళ్లికొడుకు ఒడిలోనే వధువు తనువు చాలించింది. అయితే ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల సమ్మతంతో విషాదం లోను శుభకార్యాన్ని జరిపించారు. దీంతో పెళ్లి మండపంలో పెళ్లి కుమార్తె మృతదేహాన్ని ఉంచి.. వరుడికి బాధితురాలి చెల్లెలితో వివాహం జరిపించారు. ఈ ఘటన త్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలో పెళ్లి కొడుకు మంజేష్ పెళ్లి కుమార్తె సురభి మెడలో తాళికట్టాల్సి ఉంది. అదే సమయంలో వధువు సురభి పెళ్లి పీఠలపై కుప్పకూలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైయ్యారు. వెంటనే స్థానికంగా ఉండే వైద్యుడికి సమాచారం అందించారు. పెళ్లి మండపంలోనే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ బాధితురాలు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. పెళ్లి మండపంలోనే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ పెళ్లికూతురు గుండెపోటుతో చనిపోయినట్లు నిర్ధారించారు.
దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీంతో అదే పెళ్లి మండపంలో వరుడికి మృతురాలు చెల్లెలు నిషాతో వివాహం జరిపించారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్ధం కాలేదు. నా పెద్ద చెల్లెలు సురభి డెడ్ బాడీని పెళ్లిమండంలో ఉంచాం. ఇరుకుటుంబ సభ్యుల అంగీకారంతో నా చిన్న చెల్లెలు నిషాను మంజేష్ కి ఇచ్చి వివాహం జరిపించాం. అని పెళ్లి కూతురు సోదరుడు మీడియాకు వెల్లడించాడు. పెళ్లి తర్వాత పెద్ద చెల్లలు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు.