TOP 6 News @ 6PM: గద్దర్‌కు పద్మ అవార్డ్ బరాబర్ ఇవ్వమని బండి సంజయ్ ఎందుకన్నారు?
![TOP 6 News @ 6PM: గద్దర్‌కు పద్మ అవార్డ్ బరాబర్ ఇవ్వమని బండి సంజయ్ ఎందుకన్నారు? TOP 6 News @ 6PM: గద్దర్‌కు పద్మ అవార్డ్ బరాబర్ ఇవ్వమని బండి సంజయ్ ఎందుకన్నారు?](https://assets.hmtvlive.com/h-upload/2025/01/27/1500x900_388625-bandi-sanjay-comments-on-not-giving-padma-award-to-gaddar.webp)
Bandi Sanjay Sensational Comments: పద్మ పురస్కారాలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతి ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదని.. అర్హులకు మాత్రమే అవార్డులు ప్రధానం చేస్తుందన్నారు. ఇదే సమయంలో గద్దర్ పేరును ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికే ఇస్తాం. గద్దర్‌కు ఎలా ఇస్తామన్నారు? ఆయన భావజాలం ఏంటి? బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తామన్నారు? మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారు. మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం.. బరాబర్ ఇవ్వం" అని బండి సంజయ్ అన్నారు.
అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను మార్చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి తెలంగాణ సర్కార్ అమలు చేయాలని చూస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుందన్నారు.
కేంద్రం గత పదకొండేళ్లల్లో తెలంగాణ అభివృద్ధి కోసం 12 లక్షల కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి నిధులు వస్తున్నాయా? అంటూ ఫైరయ్యారు. పేదలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయబోమని.. కేంద్రమే నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఏ పేరు పెట్టుకున్నా నో ప్రాబ్లం అని.. కానీ కేంద్ర పథకాలకు పేర్లు మార్చితే ఊరుకునేది లేదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఆ జాబితాలో ఏపీ నుంచి ఐదుగురికి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరికి చోటు దక్కింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి కేవలం రెండు పద్మ అవార్డులు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం వైఖరిని నిలదీశారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని అన్నారు.
ఇదే విషయమై ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు. అయితే తాజాగా ఈ అంశంపై మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్, ఇటు గద్దర్ అభిమానుల ఏ విధంగా స్పందిస్తారే చూడాలి మరి.
2) YS Jagan: వైఎస్ జగన్ కు సుప్రీంలో ఊరట
YS Jagan: వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సోమవారం వెనక్కి తీసుకున్నారు.
ఈ పిటిషన్ పై జనవరి 27న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. జగన్ ఆస్తుల కేసులో ట్రయల్ సరిగా జరగడం లేదని రఘురామకృష్ణరాజు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం, శుక్ర,శనివారాల్లో మాత్రమే ఈ కేసుపై విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు ప్రత్యేక కోర్టులు రోజువారీగా విచారణ చేయాలని కోరారు.
అయితే, జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కోర్టు వ్యాఖ్యల తన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
3) Pushpa 2 OTT Release Date: ఓటీటీలోకి పుష్ప2.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి, ఎక్కడ చూడొచ్చంటే
Pushpa 2 OTT Release Date: ఇటీవల టాలీవుడ్ టు బాలీవుడ్ అన్నీ సినీ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సినిమా ఏదైనా ఉందా అంటే అది పుష్ప2 అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది.
బాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కినెట్టి మరీ పుష్ప2 కలెక్షన్ల వర్షం కురిపించింది. డిసెంబర్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 1896 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రీలోడ్ వెర్షన్ పేరుతో మరో 20 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే థియేటర్లలో బంపర్ హిట్‌గా నిలిచిన పుష్ప2 మూవీ ఇకపై ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. సినీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేస్తోంది. పుష్ప2 మూవీ జనవరి 30వ తేదీ నుంచి ఓటీటీలోకి రానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 3 గంటల 40 నిమిషాల నిడివి ఉన్న వెర్షన్ ఓటీటీలోకి రానుంది.
తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి సినిమా అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే పుష్ప2 డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 100 కోట్లకు సొంతం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న పుష్ప2, ఓటీటీలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
4) Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రానే నెం. 1 టెస్ట్ క్రికెటర్ - ఐసిసి
Jasprit Bumrah Test cricket career: జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి వార్తల్లోకెక్కాడు. 2024 ఏడాదిలో టెస్ట్ క్రికెట్‌లో పర్‌ఫార్మెన్స్ ఇరగదీసిన క్రికెటర్‌గా ఐసిసి బుమ్రా పేరును ప్రకటించింది. ఐసిసి జస్‌ప్రీత్ బుమ్రాను టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 గా ప్రకటిస్తూ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టులు చేసింది. ఈ అవార్డ్ అందుకున్న తొలి ఇండియన్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రానే కావడం మరో హైలైట్.
2024 లో జస్‌ప్రీత్ బుమ్రా బంతితో మ్యాజిక్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో మెరుగైన రేటింగ్‌తో అత్యధిక వికెట్స్ తీసి బౌలర్లలో తనే నెంబర్ 1 అనిపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే బుమ్రా 32 వికెట్లు పడగొట్టి ఆసిస్ ఆటగాళ్లను కంగారు పెట్టాడు.
ఈ రేసులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్, శ్రీలంక క్రికెటర్ కమిండు మెండిస్ వంటి ఆటగాళ్లు బుమ్రా కంటే వెనుకబడిపోయారు. ఆ టాప్ క్రికెటర్స్‌ను వెనక్కు నెడుతూ 2024 లో మెరుగైన పర్‌ఫార్మెన్స్ అందించిన టెస్ట్ క్రికెటర్‌గా ఐసిసి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.
గతంలో ఇండియన్ క్రికెటర్స్‌లో ఎవరెవరికి టెస్ట్ క్రికెటర్ అవార్డ్ వచ్చిందంటే.. జస్‌ప్రీత్ బుమ్రా కంటే ముందు గతంలో ఐసిసి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్న వారి జాబితాలో ఐదుగురు క్రికెటర్స్ ఉన్నారు. రాహుల్ ద్రావిడ్, గౌతం గంభీర్, వీరేంద్ర సేహ్వాగ్, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు వారి కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు ఐసిసి ఈ అవార్డ్ ప్రకటించింది.
5) Credit Card Benefits: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా ఈ ప్రయోజనాల గురించి తెలుసా?
Credit Card Benefits: క్రెడిట్ కార్డులకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించాలి. లేకపోతే అసలుకు వడ్డీ కలిపి ఫైన్ విధిస్తారు. అయితే సకాలంలో బిల్లులు చెల్లిస్తే క్రెడిట్ కార్డులతో ఇబ్బందులుండవు. క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నో లాభాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు ఉపయోగించిన సమయంలో క్యాష్ బ్యాక్ ఆఫర్లు, లేదా క్యాష్ బ్యాక్ రివార్డులు వస్తాయి. అయితే ఇవి పాయింట్ల రూపంలో ఉంటాయి. అయితే వీటికి కొంత కాలం మాత్రమే గడువు ఉంటుంది. ఈ గడువులోపుగా వీటిని రిడీమ్ చేసుకోవాలి. షాపింగ్ లు, టికెట్ల కొనుగోలు ఇతర వాటిని క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రివార్డు పాయింట్లు ఇస్తారు.
క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోరు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. అయితే మీరు తీసుకునే క్రెడిట్ 30 శాతానికి మించవద్దు. కార్డుకు ప్రతి ఏటా కొంత నగదును సర్వీస్ చార్జీ రూపంలో ఆయా క్రెడిట్ కార్డు నిర్వాహకులు వసూలు చేస్తారు. అయితే ప్రతి ఏటా కార్డు దారులు చేసే బిల్లు ఆధారంగా ఈ చార్జీని మినహాయిస్తారు.
బిల్లింగ్ డేట్ గురించి తెలుసుకోవాలి. బిల్లింగ్ డేట్ నుంచి 45 రోజుల సమయం ఉంటుంది. ఈ లోపున ఈ డబ్బులు చెల్లించాలి. ఒకవేళ ఈ బిల్లులు చెల్లించకపోతే ఈ బిల్లు డేట్ నుంచి 30 నుంచి 40 శాతం ఫైన్ విధిస్తారు.
బిల్లింగ్ మొత్తాన్ని ఈఎంఐగా కూడా మార్పు చేసుకోవచ్చు.లేదా బిల్లింగ్ లోని కొంత అమౌంట్ ను కూడా ఈఎంఐ రూపంలోకి మార్చుకునే అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో ఈ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు.
క్రెడిట్ స్కోర్ 750 దాటితే క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి. క్రెడిట్ కార్డులు అందించిన బ్యాంకుల ఏజంట్లు వ్యక్తిగత రుణంతో పాటు ఇతర రుణాలు అందించేందుకు ముందుకు వస్తాయి. మొబైల్స్, ఇతర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే 1 నుంచి 10 శాతం వరకు డిస్కౌంట్ అందుతుంది.
6) Flipkart Month End Sale: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. ఈ మూడు ఫోన్లపై భారీ డిస్కౌంట్స్..!
Flipkart Month End Sale: గత కొన్ని రోజులుగా ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ లైవ్ అవుతోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లపై చాలా అద్భుతమైన డీల్స్ కనిపిస్తున్నాయి. ఈ సేల్ జనవరి 26 రాత్రి ముగిసింది. అయితే ఇప్పుడు ఈ ఇ కామర్స్ సైట్ మరో కొత్త సేల్‌ను ప్రకటించింది. మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభమైంది. ఈ సేల్ జనవరి 27 నుండి జనవరి 31 వరకు లైవ్‌లో ఉంటుంది. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఒప్పో K12x 5G ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 16,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 12,999కే మీ సొంతం చేసుకోవచ్చు. బాబ్‌కార్డ్ ఈఎమ్ఐతో ఫోన్‌పై రూ. 1500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, బై మోర్, సేవ్ మోర్ అనే ఆఫర్‌తో ఫోన్‌పై రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.
మోటోరోలా G45 5G ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కూడా చాలా చౌక ధరలో లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 12,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు రూ.9,999కే ఆర్డర్ చేసుకోవచ్చు. నో కాస్ట్ EMI ఎంపికతో మీరు నెలకు రూ. 1,667 చెల్లించి కూడా సొంతం చేసుకోవచ్చు.
నథింగ్ పోన్ CMF 1 CMF బై నథింగ్ ఫోన్ 1 కూడా ఈ సేల్‌లో చాలా చౌక ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 21,999 కే మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 16,999కే మీ సొంతం చేసుకోవచ్చు. బాబ్ కార్డ్ ఈఎమ్ఐతో మీకు ఫోన్‌పై రూ. 1500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.