Baisaran: అందమైన ప్రాంతాన్ని ఎరుపెక్కించిందెవరు? అక్కడ టూరిస్టులు ఎందుకు ఎక్కువ వస్తారు?

Baisaran: 'నా భర్తను కాపాడండి.. ప్లీజ్' అంటూ ఆమె వేడుకున్న ఆ శబ్దం ఇంకా బైసరన్ గాలిలో మిగిలే ఉంది.

Update: 2025-04-25 04:00 GMT
Baisaran

Baisaran: అందమైన ప్రాంతాన్ని ఎరుపెక్కించిందెవరు? అక్కడ టూరిస్టులు ఎందుకు ఎక్కువ వస్తారు?

  • whatsapp icon

Baisaran: చూడటానికి ఎంతో అందంగా కనిపించే బైసరన్.. ఒక్కసారిగా రక్తపాతంతో నిండిపోతుందని అప్పటివరకు ఎవరూ ఊహించి ఉండరు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో ఉన్న బైసరన్ వ్యాలీ.. పచ్చని కొండలు, మంచుతో కప్పిన పర్వతాలు, నీలినీడల ముసుగుతో భూమ్మీద స్వర్గంలా కనిపించే అందమైన ప్రదేశం. ఇక అప్పటివరకు ప్రేమతో వెలిగిపోయిన ఆ ప్రాంతం ఒక్క క్షణంలోనే రక్తసంద్రమైంది. ఎవరూ ఊహించని రీతిలో ముసుగు ధరించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఓ వైపు భర్తతో ఎంతో ఆనందంగా బెల్పూరి తింటూ నవ్వుకుంటూ కూర్చున్న ఓ అమ్మాయి.. మరో క్షణంలోనే తన భర్త రక్తపు మడుగులో పడిపోవడాన్ని చూసింది.

ముందుగా నీ పేరంటని అడిగారు.. తర్వాత మతం ఏంటని అడిగారు.. సమాధానం చెప్పేలోపే భర్త గుండెల్లోకి తూటా దూసుకెళ్లింది. కళ్ల ముందే భర్తను కోల్పోయిన ఆ అమ్మాయి బతికి ఉన్న శవంలా మిగిలిపోయింది. కొత్తగా పెళ్లి చేసుకుని.. జీవితాన్ని కొత్తగా ఆరంభించేందుకు వచ్చిన దంపతుల కలలను ఉగ్రవాదం ఛిద్రం చేసింది. ఏప్రిల్ 4న పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి.. 18 రోజుల్లోనే భర్తను కోల్పోయింది. జీవితాంతం తన భర్తతో కలిసి పంచుకోవాల్సిన జ్ఞాపకాలను.. ఒక్కరోజులోనే తుడిచిపెట్టేశారు ముష్కరులు. భర్తను కళ్లముందే తుపాకీతో చంపేసిన దృశ్యం చూసిన ఆ పెళ్లికూతురి గుండె తునాతునకలైంది. 'నా భర్తను కాపాడండి.. ప్లీజ్' అంటూ ఆమె వేడుకున్న ఆ శబ్దం ఇంకా బైసరన్ గాలిలో మిగిలే ఉంది. ఒక మనిషి గుండెకు భరించలేని బాధ ఇంతకంటే ఉంటుందా? ప్రేమగా మాట్లాడుకుంటూ బెల్పూరి తింటున్న క్షణం నుంచి... నిమిషాల వ్యవధిలోనే శవాన్ని కౌగిలించుకున్న క్షణానికి మలుపు తిరిగిన ఈ కథ గురించి వింటుంటునే ఏడుపు ఉబికి వస్తోంది.


ఈ దాడికి పాల్పడింది తామేనని 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఇది పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబాకు చెందిన ఓ షాడో గ్రూప్. అంటే మరోసారి ఉగ్రదాడికి పాకిస్థానే కారణమని అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News