Pahalgam Attack: పహల్గామ్ దాడి ఉగ్రవాదులను పట్టిస్తే 20 లక్షల రివార్డు..అనంత్ నాగ్ పోలీసుల సంచలన ప్రకటన

Terrorist organization angered over demolition of terrorists' homes
Pahalgam Attack: జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ దేశం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఘటనకు కారణమైన వారిని పట్టుకునేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు లోయలో గాలిస్తున్నారు. ఈ సమయంలో అనంత్ నాగ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించినవారికి రూ. 20లక్షల నగదు బహుమతి అందిస్తామని బుధవారం ప్రకటించారు. ఈ దాడిపై ప్రభుత్వం ఘాటుగా స్పందిస్తున్న సమయంలో పోలీసులు ఈ ప్రకటన చేశారు. కాశ్మీర్ లోయలో భారత ఏజెన్సీలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఉగ్రవాదులను గుర్తించేందుకు నిఘాను మరింత పెంచాయి. నిరంతరం తనిఖీలు చేపట్టాయి. ఈ మారణహోమానికి పాకిస్తాన్ తో సంబంధాలు ఉండటంతో మోదీ ప్రభుత్వం చర్య తీసుకుని సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతోపాటు పాకిస్తాన్ పౌరులు దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. వారికి వీసాలు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దేశంలో ఉన్న పాకిస్తానీయులు 48గంటల్లో తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ప్రభుత్వం సూచించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని బైసరన్, పహల్గామ్‌లో మంగళవారం పర్యాటకులపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను హతమార్చడానికి దారితీసే సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని అనంత్‌నాగ్ పోలీసులు ఒక పోస్టర్ విడుదల చేశారు. సమాచారం ఇచ్చేవారి గుర్తింపు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
మీరు ఇక్కడ సమాచారాన్ని అందించవచ్చు
9596777666 - SSP అనంతనాగ్
9596777669 - పిసిఆర్ అనంతనాగ్
ఈ-మెయిల్: dpoanantnag-jk@nic.in
మంగళవారం, పహల్గామ్‌లోని 'మినీ స్విట్జర్లాండ్'గా పిలువబడే పర్యాటక ప్రదేశం బైసారన్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ సంఘటనలో పాల్గొన్న అనుమానిత పాకిస్తాన్ ఉగ్రవాదుల పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అని అధికారులు తెలిపారని పిటిఐ తెలిపింది. ఈ ముగ్గురు ఉగ్రవాదుల 'కోడ్' పేర్లు మూసా, యూనస్, ఆసిఫ్. సమాచారం ప్రకారం, ఈ ముగ్గురు ఉగ్రవాదులు పూంచ్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటనలలో కూడా పాల్గొన్నారని తెలుస్తోంది.