Indian weapons: రఫెల్‌తో పాటు టాప్‌ రేంజ్‌ మిస్సైల్స్‌.. ఇక కాస్కో పాక్!

Indian weapons: 2020లో లడఖ్‌లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతకు ముందు PLA చేసిన బలపరీక్షలు గుర్తొస్తాయి.

Update: 2025-04-26 00:30 GMT
Indian weapons

Indian weapons: రఫెల్‌తో పాటు టాప్‌ రేంజ్‌ మిస్సైల్స్‌.. ఇక కాస్కో పాక్!

  • whatsapp icon

Indian weapons: భారత్‌లోని పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌తో సంబంధాలు మరింత ఉద్రిక్తతకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం నిర్వహించిన 'ఆక్రమణ్' యుద్ధయానం అంతర్భావాన్ని ప్రపంచం గమనిస్తోంది. ఇది కేవలం ఒక సాధారణ రొటీన్ డ్రిల్‌గా చెప్పినప్పటికీ, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో దీని ప్రాముఖ్యత అమితంగా పెరిగింది.

ఈ సార్వత్రిక స్థాయి యుద్ధ వ్యాయామంలో రఫెల్ వంటి అగ్రశ్రేణి యుద్ధవిమానాలు భాగంగా మారాయి. దేశంలోని ఉత్తమ పైలట్లు పాల్గొనడం దీని తీవ్రతను, వ్యూహాత్మక ఉద్దేశాలను స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా, హిమాలయ ప్రాంతాల్లాంటి క్లిష్ట భూభాగాల్లో గగనతల దాడులపై ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారు. దీని ద్వారా దాడుల‌కు సిద్ధంగా ఉన్నాం అనే సంకేతాన్ని పక్కదేశాలకు పంపినట్టే.

అంతేకాదు, ఈ వ్యాయామంలో IAF బలగాలు అనేక వైమానిక బేస్‌ల నుంచి తరలించి, పొడవైన పరిధిలో సోర్టీలు చేపట్టినట్టు తెలుస్తోంది. దీన్ని ఉద్దేశ్యపూర్వకంగా, డీప్ స్ట్రైక్ దాడులకు అనుకూలంగా నిర్వహించినట్టుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పాటు సీనియర్ వైమానిక దళాధికారుల పర్యవేక్షణలో అభ్యాసం జరిగింది. విమాన దళంతో పాటు భారత నౌకాదళం కూడా అరేబియా సముద్రంలో తన రెడినెస్‌ను నిరూపించుకుంది. INS సూరత్ నౌక నుంచి మధ్యస్థాయి ఉపరితల-గగన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఇదే సమయంలో పాకిస్థాన్ కూడా తమ క్షిపణి పరీక్ష కోసం NOTAM జారీ చేశారు. ఈ చర్యలన్నింటి మధ్య పాకిస్థాన్ తన వాయు దళ విమానాలను కరాచీ నుంచి ఉత్తర వైపు (లాహోర్, రావల్పిండి)కు తరలించడం చూస్తే, వారికి కలిగిన ఆందోళన స్పష్టంగా అర్థమవుతుంది.

ఇలాంటి యుద్ధాభ్యాసాలు ఇంత ప్రామాణిక స్థాయిలో జరుగుతున్నప్పుడు, అవి తరచుగా ఓ పెద్ద మిలిటరీ స్పందనకు ముందు సంకేతంగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. 2020లో లడఖ్‌లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతకు ముందు PLA చేసిన బలపరీక్షలు గుర్తొస్తాయి. సరిగ్గా అలానే 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ముందు 'జపాన్' అనే భారీ వ్యాయామం జరిగింది.

Tags:    

Similar News