
Air India: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్ని ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. భారత్ కు చెందిన విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు తెలిపింది. దీంతో ఆ మేర ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ ప్రయాణ సమయం కారణంగా టికెట్ ధర కూడా ఆ మేర పెరిగే అవకాశం ఉందని విమానయాన వర్గాలు తెలిపాయి.
భారత్ కు చెందిన విమానాలకు పాకిస్తాన్ తన గగనతం నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. దీంతో ఉత్తర అమెరికా, యూకే, యూరప్, పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే వెళ్లే విమానాలు ప్రత్యామ్నాయ సుదూరపు మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. గగనతలం మూసివేత మా చేతిలో లేని వ్యవహారం. ఏదేమైనా ఎయిరిండియా ప్రయాణికులు, సిబ్బంది భద్రత అనేది మాకు ముఖ్యమని ఎయిరిండియా ఎక్స్ పోస్టులో తెలిపింది.
పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేతతో తాము నడిపే కొన్ని అంతర్జాతీయ విమానాలపై ప్రభావం పడుతోందని ఇండిగో సంస్థ తెలిపింది. వీలైనంత తొందరగా గమ్యస్థానాలకు చేర్చడంలో తమ సిబ్బంది ప్రయత్నిస్తారని పేర్కొంది. ఒకవేల మీరు ప్రయాణించ విమానంపైనా దీని ప్రభావం ఉంటే స్టేటస్ చెక్ చేసి తమ వెబ్ సైట్ ద్వారా రీ బుకింగ్ లేదా రిఫండ్ ను పొందవచ్చని ప్రయాణికులకు సూచిస్తూ ఎక్స్ వేదికగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఎయిరిండియా, ఇండిగోతోపాటు స్పైస్ జెట్, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కూడా అంతర్జాతీయ సర్వీసులను నడిపిస్తున్నాయి. ఉత్తరాది నగరాల నుంచి పశ్చిమ దేశాలపై వెళ్లే విమానాలపై గగనతలం మూసివేత ప్రభావం చూపుతుంది.