Aarogya Setu's New Feature: సరికొత్త ప్యూచర్‌తో 'ఆరోగ్య సేతు' యాప్
Aarogya Setu's New Feature: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా భారత్ ప్రవేశ పెట్టిన యాపే కోవిడ్ ట్రేసింగ్ ''ఆరోగ్య సేతు" యాప్. ఈ యాప్ ద్వారా బాధితులను గుర్తించడంతో పాటు వారిని అప్రమత్తం చేసి తగిన చికిత్స అందించడం ఆరోగ్య కార్యకర్తలకు తేలికైంది.
Aarogya Setu's New Feature: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా భారత్ ప్రవేశ పెట్టిన యాపే కోవిడ్ ట్రేసింగ్ ''ఆరోగ్య సేతు" యాప్. ఈ యాప్ ద్వారా బాధితులను గుర్తించడంతో పాటు వారిని అప్రమత్తం చేసి తగిన చికిత్స అందించడం ఆరోగ్య కార్యకర్తలకు తేలికైంది. ఈ క్రమంలో యాప్ మరింత అభివృద్ధి చేస్తూ 'ఆరోగ్య సేతు' యాప్ లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది.
కరోనా విజృంభన నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేసేలా ''ఓపెన్ ఏపీఐ సర్వీస్''ను తీసుకువచ్చింది. ఈ ప్యూచర్ తో వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు, ఈ యాప్‌ను ఉపయోగించే ఇతర యూజర్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వీలు కల్పించింది. అయితే ఇందుకు సదరు యూజర్ల అంగీకారం తప్పనిసరి అని, దీని ద్వారా ఆరోగ్య సేతు యాప్ యూజర్ల డేటా, గోప్యతకు ఎలాంటి భంగం కలగబోదని స్పష్టం చేసింది.
అదే విధంగా ఇందులో ఆరోగ్య సేతు స్టేటస్, వినియోగదారుని పేరు తప్ప మరే ఇతర వివరాలు ఉండవని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రాణాంతక కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 30 వేల పాజిటివ్ కేసులను గుర్తించినట్టు సమాచారం. ఈ ప్రస్తుతం యాప్‌ను దాదాపు 15 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు.