8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రానుందా? జీతాలు పెరగనున్నాయా?

Update: 2025-04-23 16:38 GMT
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రానుందా? జీతాలు పెరగనున్నాయా?
  • whatsapp icon

8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుండో ఎదురుచూస్తోన్న 8వ వేతన సంఘం ఏర్పాటుపై లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. 8వ వేతన సంఘం ఏర్పాటులో వేగం పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను, పెన్షనర్స్ పెన్షన్లను రీస్ట్రక్చర్ చేసే 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఎక్స్‌పెండిచర్ విభాగం ఒక వేకెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం 35 పోస్టులను భర్తీ చేసే లక్ష్యంతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

పర్సనల్ డిపార్ట్‌మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం (DoPT) నియమ నిబంధనల ప్రకారమే ఈ పోస్టింగ్స్ ఉంటాయని ఎక్స్‌పెండిచర్ విభాగం ఈ నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది. డిప్యూటేషన్‌పై ఈ పోస్టుల్లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అంటే 8వ వేతన సంఘం పని పూర్తయితే, ఆయా పోస్టుల్లో పని చేసే వారు మళ్లీ తిరిగి ఎవరి ఒరిజినల్ పోస్టుల్లోకి వారు వెళ్లిపోవాల్సి ఉంటుంది.

ఇక ఈ 8వ వేతన సంఘం ఏర్పడిన వెంటనే వారు ఇచ్చే నివేదిక, సిఫార్సుల ఆధారంగా ఉద్యోగుల శాలరీ, హెచ్ఆర్ఏ, డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ రీస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. అలాగే పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్స్ కూడా పెంచే అవకాశం ఉంది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆ శుభదినం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక గతంలో ఉన్న పే కమిషన్స్ సిఫార్సుల ప్రకారం 6వ వేతన సంఘం HRA శ్లాబులను 30%, 20%, 10% గా నిర్ణయించగా 7వ వేతన సంఘం వాటిని సవరించి 24%, 16%, 8% తగ్గించింది. కానీ అదే సమయంలో డిఏ 50 శాతానికి పెరగడంతో HRA కూడా మళ్లీ 30%, 20%, 10 శాతానికి చేరింది.

ఇక ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే 8వ వేతన సంఘం కూడా మరోసారి ఉద్యోగుల వేతనాలు, భత్యాలను రివ్యూ చేయనుంది. 7వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 గా నిర్ణయించగా ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 గా ఉండే అవకాశాలున్నాయని అంచనాలు వస్తున్నాయి. ఆ ప్రకారమే చూసినట్లయితే, ప్రస్తుతం ఉద్యోగులు అందుకుంటున్న బేసిక్ పే శాలరీని ఈ 1.92 ఫిట్మెంట్‌తో గుణించడం ద్వారా కొత్త బేసిక్ పే శాలరీని నిర్ణయించడం జరుగుతుంది.

అయితే, క్రితంసారి ఇచ్చిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కంటే ఈసారి తక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రానుందనేది ఒక రకంగా అది వారికి బ్యాడ్ న్యూస్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే బేసిక్ శాలరీ ఆధారంగానే హెచ్ఆర్ఏ లెక్కించడం జరుగుతుందనే విషయం తెలిసిందే.

ఉదాహరణ కోసం ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ. 40,000 ఉంది అనుకుంటే, వారి బేసిక్ శాలరీ రూ. 40,000 X 1.92 తో గుణిస్తే 76,800 అవుతుంది. ఇదే కొత్తగా వారికి అందబోయే బేసిక్ శాలరీ అవుతుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే వారికి జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

Similar News