కశ్మీర్‌లో మళ్ళీ కాల్పుల మోత మోగింది. పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పాక్ నుంచి మిగతా ముగ్గురు సరిహద్దుకు ప్రాంతానికి నుంచి వచ్చినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. కాగా
పుల్వామా జిల్లా హన్జన్‌లో ఉగ్రవాదులున్నారని పక్కాగా సమాచారం అందడంతో భద్రతా దళాలు గాలింపు నిర్వహించాయి, అయితే ఓ ఇంటిలో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు. దాంతో భద్రతా దళాలు కూడా వారిపై ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులందరూ జైషే మహ్మద్ సంస్థకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలం నుంచి ఆయుధాలు, భారీగా పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.