Pahalgam Terror Attack: పహల్‌గామ్ టెర్రర్ ఎటాక్‌లో 26 మంది పర్యాటకులు మృతి

Pahalgam Terror Attack News updates: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంతమంది పర్యాటకులు గాయపడ్డారు. పహల్‌గామ్‌లోని బైశరన్ లోయలో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతం గుండా వచ్చిన టెర్రరిస్టులు అక్కడున్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు.
గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించడం కోసం ఆర్మీ హెలీక్యాప్టర్లను రంగంలోకి దింపారు. ఘటన జరిగిన ప్రాంతం ఎత్తైన కొండల మధ్య ఉంది. అక్కడికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో అత్యవసర సేవల కోసం ఆర్మీ హెలీక్యాప్టర్లను ఉపయోగిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం సౌది అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. కశ్మీర్ వెళ్లి పరిస్థితిని నేరుగా సమీక్షించాల్సిందిగా కేంద్రమంత్రిని ప్రధాని ఆదేశించారు.

ప్రధాని మోదీ ఆదేశాలతో కేంద్రమంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకున్నారు. జమ్ముకశ్మీర్ లో భద్రతపై అత్యవసర సమావేశం నిర్వహించారు.
పహల్‌గామ్ ఘటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇంతటి అమానవీయ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పశువులతో పోల్చిన ఆయన బాధితులను ఓదార్చడానికి పదాలు కూడా దొరకడం లేదన్నారు.
I’m shocked beyond belief. This attack on our visitors is an abomination. The perpetrators of this attack are animals, inhuman & worthy of contempt. No words of condemnation are enough. I send my sympathies to the families of the deceased. I’ve spoken to my colleague @sakinaitoo…
— Omar Abdullah (@OmarAbdullah) April 22, 2025
గత కొన్ని ఏళ్లలో పౌరులపై, పర్యాటకులపై ఇలాంటి దాడి ఎన్నడూ జరగలేదు. ఉగ్రవాదుల దాడిపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందిస్తూ ఈ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులకు శిక్ష పడేలా చూస్తామని అన్నారు.