Agra Hospital: ఆగ్రా ఆసుపత్రిలో 22 మంది మృతి..?

Agra Hospital: అనుమతులకు మించి కోవిడ్‌ పేషెంట్లను చేర్చుకున్న ఓ ఆసుపత్రి ఆక్సిజన్‌ కొరత ఏర్పడడంతో కొందరిని బయటకు పంపేందుకు పథకం రచించింది.

Update: 2021-06-09 06:32 GMT

Agra Hospital: ఆగ్రా ఆసుపత్రిలో 22 మంది మృతి..?

Agra Hospital: అనుమతులకు మించి కోవిడ్‌ పేషెంట్లను చేర్చుకున్న ఓ ఆసుపత్రి ఆక్సిజన్‌ కొరత ఏర్పడడంతో కొందరిని బయటకు పంపేందుకు పథకం రచించింది. మాక్‌ డ్రిల్‌ పేరుతో ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడింది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి 22 మంది చనిపోయారని తెలుస్తోంది. ఏప్రిల్‌ 26న జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. దాంతో ఆసుపత్రి వ్యవహారంపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.

Tags:    

Similar News