పవర్ స్టార్ ఇంట అకీరా పుట్టిన రోజు వేడుకలు.. అకీరా సినిమా అతనితో ఫిక్స్?
మెగాకుటుంబంలో ఇవాళ రెండు వేడుకలు జరుగుతున్నాయి, ఒక వైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు, మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకిరానందన్ పుట్టినరోజు కావడం విశేషం.

మెగాకుటుంబంలో ఇవాళ రెండు వేడుకలు జరుగుతున్నాయి, ఒక వైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు, మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకిరానందన్ పుట్టినరోజు కావడం విశేషం. కాగా పవన్ కళ్యాణ్ కుమారుడికి పుట్టినరోజు సందర్భంగా అకిరాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అకీరాకు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.పవన్ , రేణు దేశాయ్ ల తొలి సంతానం అయిన అకిరా నందన్.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. రేణుదేశాయ్ దగ్గర పవన్ పిల్లలు అకీరా, ఆద్యా ఉంటున్నారు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ వారసుడిగా అకిరా నందన్ అని అభిమానులు చెబుతుంటారు. అకిరా కూడా సమయం దొరికినప్పుడు తండ్రి దగ్గరకు వస్తుంటాడు. మెగా ఫ్యామిలీతో కలిసే ఉంటాడు.2004లో పుట్టిన అకిరా నందన్ వయసు 16 ఏళ్లు.
అకిరా ఓ మరాఠీ చిత్రంలో నటించాడు. రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. అకిరానందన్ ను తెలుగు తెరకు పరిచయం చేయాలని దర్శక నిర్మాతలు ఇప్పనుంచే పోటీపడుతున్నారు. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లోనే అకీరా తొలి సినిమాను నిర్మిస్తాడని టాక్. ఎందుకంటే రామ్ చరణ్ కు బాబాయ్ పవన్ అన్నా ఆయన పిల్లలన్నా చాలా అభిమానం.