Nagarjuna: "ముందే తెలిస్తే అన్నమయ్య, శివ లాంటి సినిమాలే చేసేవాడిని," అంటున్న నాగార్జున
Nagarjuna: "ముందే తెలిస్తే అన్నమయ్య, శివ లాంటి సినిమాలే చేసేవాడిని," అంటున్న నాగార్జున
Nagarjuna: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు ది గోస్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నాగార్జున కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తర్వాత ఎలాంటి పాత్రలు తనకి సెట్ అవుతాయో తెలుసుకున్నారా అని అడగగా నాగ్ చాలా సింపుల్ గా లేదు అని చెప్పారు. "నేను మాత్రమే కాదు.
సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు సినిమా హిట్ అవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేరు. కొన్నిసార్లు నటీనటులకు దర్శకనిర్మాతలకు బాగా నచ్చిన సినిమా ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు," అని అన్నారు నాగార్జున. "శివ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని నాకు ఇచ్చిన అదే రాంగోపాల్ వర్మ ఆఫీసర్ లాంటి సినిమా కూడా ఇచ్చారు. నిన్నే పెళ్లాడతా వంటి సూపర్ హిట్ ని ఇచ్చిన కృష్ణవంశీ చంద్రలేఖ సినిమాతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు.
రాఘవేందర్ రావు గారు అన్నమయ్య సినిమా తీస్తున్నప్పుడు నేను సినిమాని ఆపేయమని అడిగాను కానీ ఆ సినిమా నా కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా మారింది. ఒకవేళ నాకు ఏ సినిమా హిట్ అవుతుంది అని ముందే తెలిస్తే అదే సినిమా చేస్తాను కదా. శివ, అన్నమయ్య లాంటి సినిమాలే ఎప్పుడు చేస్తూ ఉంటాను," అని అన్న నాగార్జున ఏదేమైనా మంచి కథతో వచ్చిన సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు.