Taraka Ratna: తారకరత్నకు కన్నీటి వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు
Taraka Ratna: పాడె మోసిన బాలకృష్ణ, కుటుంబసభ్యులు
Taraka Ratna: హైదరాబాదులో సినీ నటుడు తారకరత్న అంతిమయాత్ర కొనసాగుతోంది. ఫిలించాంబర్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. తారకరత్న అంతిమయాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతిమయాత్ర సందర్భంగా తారకరత్న పిల్లలు విలపించడం అందరినీ కలచివేసింది. కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలోని నివాసం నుంచి ఈ ఉదయం తారకరత్న భౌతికకాయాన్ని ఫిలించాంబర్ కు తరలిచారు. అభిమానులు భారీగా తరలివచ్చి తారకరత్నకు నివాళులు అర్పించారు.