Singer Sunitha: హ్యాపీ బర్త్ డే సునీత.. ఆ ఒక్క పాట జీవితాన్నే మార్చేసింది..
Happy Birthday Singer Sunitha: సింగర్ సునీత..స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్.
Happy Birthday Singer Sunitha: సింగర్ సునీత..స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. సునీత గానంతోనే కాదు.. రూపంలోనూ ఆకట్టుకుంటుంది. ఆమె నవ్వుకు ముగ్ధులు కానివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. నేడు సునీత పుట్టినరోజు సందర్భంగా..ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా,యాంకర్‌గా సత్తా చాటిన సునీత 1978 మే 10న విజయవాడలో జన్మించింది. ఈమె పూర్తి పేరు సునీత ఉపాద్రష్ట. (Instagram/Photo)
సునీత తల్లి తండ్రులు ఉపద్రష్ట నరసింహారావు, సుమతి. (Instagram/Photo)
ఇంట్లో దాదాపు అందరూ సంగీత విద్వాంసులు కావడంతో చిన్నతంలోనే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంది సునీత. (Instagram/Photo)
అలా 13 ఏళ్లకే గురువుతో కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొని ఔరా అనిపించింది. (Instagram/Photo)
ఆమె 15 ఏళ్ల వయసులో 'పాడుతా తీయగా' పోగ్రాంలో పాల్గొంది. (Instagram/Photo)
గాయనిగా మొదటి మూవీ రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'గులాబి'లో "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" పాటతో కెరీర్ ప్రారంభించారు సునీత. (Twitter/Photo)
ఒక్క పాటతో సంగీత అభిమానుల్ని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో తన శ్రావ్యమైన గొంతుతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. (Instagram/Photo)
తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రియా, భూమిక, మీరా జాస్మిన్ సహా పలువురు హీరోయిన్లకు గాత్రదానం చేసింది. అలా ఎనిమిదేళ్ల కాలంలోనే సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. (Instagram/Photo)
ఆ సమయంలో సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వరించినా సున్నితంగా తిరస్కరించింది. ఇప్పటి వరకు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కలిపి మూడు వేల పైచిలుకు పాటలు పాడింది. (Instagram/Photo)
19 ఏళ్లకు కిరణ్ కుమార్ గోపరాజును వివాహం చేసుకున్న సునీత ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడిపోయింది. ఈ దంపతులకు ఆకాశ్, శ్రేయ అనే పిల్లులున్నారు. (Instagram/Photo)
ఈ ఏడాది జనవరి 9న వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేనితో సునీత రెండో వివాహం చేసుకుంది. కాగా.. సునీత, రామ్‌లు ఇరువురికి కూడా ఇది రెండో పెళ్లి. (Instagram/Photo)