నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రామచంద్రపురం టీజర్ విడుదల

Ramachandrapuram: నిహాన్ కార్తికేయన్ ఆర్ సమర్పణలో త్రీ లిటిల్ మంకీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రశాంత్ మాడుగుల..

Update: 2021-07-05 09:10 GMT

నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రామచంద్రపురం టీజర్ విడుదల

Ramachandrapuram: నిహాన్ కార్తికేయన్ ఆర్ సమర్పణలో త్రీ లిటిల్ మంకీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన తరగణంలో ఆర్. నరేంద్రనాథ్ దర్శకత్వం లో నిహాన్ కార్తికేయన్ ఆర్ నిర్మిస్తున్న చిత్రం "రామచంద్రపురం". రామాయణం ఇతివృత్తం ఆధారంగా ఒక పల్లెటూరు లో జరిగే యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రం ఆద్యంతం రామచంద్రపురం అనే పల్లెటూరులో చిత్రించారు. ఈ చిత్రం లోని మొదటి టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ "టీజర్ చాలా బాగుంది. వైవిధ్యభరితంగా ఉంది. అనిమేషన్ రూపం లో టీజర్ చాలా కొత్తగా ఉంది. టీజర్ చూడగానే సినిమా కూడా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి విజయవంతం కావాలి" అని కోరుకున్నారు.

దర్శకుడు ఆర్. నరేంద్రనాథ్ మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నిహాన్ కార్తికేయన్ ఆర్ కి నా ధన్యవాదాలు. ఖర్చుకు వెనుకాడకుండా మా "రామచంద్రపురం" చిత్రాన్ని నిర్మించారు. అద్భుతమైన క్వాలిటీ లో సినిమా రెడీ అవుతుంది. పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన యాక్షన్ డ్రామా చిత్రం. మేము చిత్రం మొత్తం రామచంద్రపురం అనే ఊరిలో నిజమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. షూటింగ్ పూర్తయింది. రెండు పాటలు విడుదల చేసాము మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు టీజర్ విడుదల చేస్తున్నాం, అందరికి నచ్చుతుంది అని నమ్ముతున్నాం. మా సినిమా ని త్వరలోనే విడుదల చేస్తాము" అని తెలిపారు.

హీరో హీరోయిన్ మాట్లాడుతూ "రామచంద్రపురం పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఒక యాక్షన్ డ్రామా చిత్రం. సినిమాలో పనిచేస్తున్న నటి నటులు టెక్నికాన్స్ అందరు 25 వయసు వాళ్లే. సినిమా యూత్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. రెండు పాటలు విడుదల అయ్యాయి, చాలా బాగా వచ్చాయి, ఇప్పుడు టీజర్ విడుదల అయ్యింది. అందరికి నచ్చుతుంది" అని తెలిపారు.

సినిమా పేరు - రామచంద్రపురం, నటి నటులు : ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్న, తదితరులు, కెమెరా : ఉమా పరమేశ్వర్. ఎడిటింగ్ : అనిల్ మునిగలా. ఎస్ ఎఫ్ ఎక్స్ : వెంకట్ . స్టీరియో మిక్సింగ్ : విష్ణు. సంగీతం : ప్రశాంత్ బి జె. కో డైరెక్టర్ : భరత్ కుమార్ డి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయినాథ్ తూర్పు, అరవింద్ ఆర్. నిర్మాత : నిహాన్ కార్తికేయన్ ఆర్. దర్శకుడు : ఆర్. నరేంద్రనాథ్.

Full View


Tags:    

Similar News