OTT Movie: ఓటీటీలోకి టైమ్ లూప్ కాన్సెప్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!
OTT Movie: భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఆదరించడంలో ప్రేక్షకులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

OTT Movie: ఓటీటీలోకి టైమ్ లూప్ కాన్సెప్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!
OTT Movie: భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఆదరించడంలో ప్రేక్షకులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలకు ఆదరణ లభిస్తోంది. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటా మూవీ.? కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అంతుచిక్కని రహస్యాలు, టైమ్ లూప్ వంటి విభిన్న కాన్సెప్ట్ ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన మూవీ రాక్షస. మార్చి మొదటి వారంలో థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 11 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
ప్రజ్వల్ దేవరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను లోహిత్ హెచ్ తెరకెక్కించారు. థియేటర్లలో మార్చి మొదటివారంలో విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
కథేంటంటే..
ఒక కీలక కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారి శోభరాజ్పై సర్వీసు నుంచి బహిష్కరించే పరిస్థితి వస్తుంది. అయితే చివరి అవకాశంగా నేరస్థులను పట్టుకునేందుకు ఒక్కరోజు అనుమతి ఇవ్వమని కోరుతాడు. ఈ ప్రయత్నంలో సహాయం కోసం సస్పెండ్ అయిన మాజీ ఆఫీసర్ సత్య (ప్రజ్వల్)ను సంప్రదిస్తాడు.
ఈ తరుణంలో సత్యకు ఒక చెక్క పెట్ట దొరుకుంది. దానిని తెరిచిన అతని చుట్టూ ప్రపంచం మారిపోతుంది. ఇదంతా టైమ్‌లూప్ గేమ్‌గా మారుతుంది. వింత పరిణామాల వెనుక నిజం ఏంటి? చెక్క పెట్టె రహస్యం ఏమిటి? సత్య గమ్యం చేరగలడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.