Unstoppable Talk Show: ఒక్క ఎపిసోడ్ కి 40 లక్షలు తీసుకోబోతున్న బాలకృష్ణ

* రెమ్యునరేషన్ మొత్తం చారిటీ కి ఇవ్వబోతున్న బాలయ్య

Update: 2021-10-19 15:30 GMT

ఒక్క ఎపిసోడ్ కి 40 లక్షలు తీసుకోబోతున్న బాలకృష్ణ (ఫోటో: ఆహ)

Balakrishna: ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా, రాజకీయనాయకుడిగా ఎంతోమంది అభిమానులను సంపాదించిన నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల కోసం "అన్స్టాపబుల్" అనే ఒక సెలబ్రిటీ టాక్ షో తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆహా వీడియో లో ఈ షో టెలికాస్ట్ కాబోతోంది. తాజాగా ఈ షో కోసం బాలకృష్ణ అందుకోబోతున్న రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్క ఎపిసోడ్ కోసం బాలయ్య ఏకంగా 40 లక్షలు తీసుకోబోతున్నారట. అంతేకాకుండా ఈ షో లో మొత్తం పన్నెండు ఎపిసోడ్లు రాబోతున్నాయి.

అంటే షో మొత్తానికి కలిపి బాలకృష్ణ తీసుకోబోయే రెమ్యునరేషన్ అక్షరాల 5 కోట్లు. అయితే బాలకృష్ణ తనకి వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం చారిటీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. "ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్" అనే క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ షో పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. హోస్ట్ అవతారంలో బాలకృష్ణ ని చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 4 నుంచి ఈ షో ఆహా లో స్ట్రీమ్ కాబోతోంది. ఇక సినిమాల పరంగా బాలకృష్ణ త్వరలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

Tags:    

Similar News