Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. సినిమా వచ్చేది అప్పుడే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Update: 2025-04-12 04:18 GMT
Pawan Kalyan Hari Hara Veeramallu Release Date Locked Grand Comeback After Deputy CM Role

Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. సినిమా వచ్చేది అప్పుడే..

  • whatsapp icon

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలవుతోన్న తొలి సినిమా కావడంతో భారీగా అంచనాలు ఉన్నాయి.

చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా నటిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్య కాలంలో జరిగే సంఘటనల ఆధారంగా, ఒక విప్లవాత్మక యోధుడి గాధగా ఈ కథ సాగనుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుండగా, ప్రముఖ బాలీవుడ్ నటులు బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి సృజనాత్మక దర్శకుడు కాగా, దర్శకత్వ బాధ్యతలు ఎ.ఎం. జ్యోతికృష్ణ చేపట్టారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు ఈ సినిమాను నిర్మించగా, ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వచ్చింది. కోవిడ్ మహమ్మారి ప్రభావం, పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలు కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత దర్శకుడు మారడం ఇలా ఎన్నో అంశాలు ఈ సినిమా ఆలస్యానికి కారణమయ్యాయి. అయితే ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం చిత్రం చివరి దశ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డబ్బింగ్, రీరికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి భాగాలు త్వరితగతిన పూర్తి చేస్తుండటం విశేషం. ఈ చిత్రం 2025 మే 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు‌తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చారిత్రక నేపథ్యంలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News