'జెర్సీ' సినిమా ఈ క్రికెటర్ గురించేనా?
'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' సినిమాలతో వరుసగా ఫ్లాప్ లను అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన ఆశలన్నీ 'జెర్సీ' సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు నాని.
'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' సినిమాలతో వరుసగా ఫ్లాప్ లను అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన ఆశలన్నీ 'జెర్సీ' సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు నాని. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా ఫలానా క్రికెటర్ బయోపిక్ అని లేదా ఒక క్రికెటర్ జీవిత చరిత్ర నుండి స్ఫూర్తి అని చిత్ర బృందం ఎప్పుడూ చెప్పలేదు. కానీ నాని చేసిన ట్వీట్ బట్టి ఈ సినిమా అప్పట్లో క్రికెట్ లో సంచలనం సృష్టించిన రమణ లాంబ జీవితం ఆధారంగా ఉండబోతోందని తెలుస్తోంది.
80ల్లో క్రికెట్ ప్రేమికులకు ఇతను తెలియని వారు ఉండరు. దేశవాళీ క్రికెట్ లో ఆడిన 87 మ్యాచులు రమణ్ లాంబా 22 సెంచరీలు 5 డబుల్ సెంచరీలు కూడా సాధించాడు. 1996-97 రంజీలో పరుగుల వర్షం కురిపించి భారత జట్టు కు ఎంపికయ్యాడు. తరువాత నాలుగు టెస్టులు, 32 వండేలలో ఇతని ప్రతిభ చూపాడు. నిజంగానే ఎమోషనల్ గా లాంబా జర్నీ సాగింది. అందుకే 'జెర్సీ' సినిమా లాంబా బయోపిక్ లా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.