Mahit Narayan: అన్నయ్య భార్య మళ్లీ పెళ్లి చేసుకుంది.. ఆస్తులు అమ్ముకొని అమెరికా వెళ్లిపోయింది..

Mahit Narayan: ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఇప్పుడు మన మధ్య లేరు.

Update: 2023-03-31 15:00 GMT
Music Director Chakris brother Mahith Narayan Comments about his brothers wife

Mahit Narayan: అన్నయ్య భార్య మళ్లీ పెళ్లి చేసుకుంది.. ఆస్తులు అమ్ముకొని అమెరికా వెళ్లిపోయింది..

  • whatsapp icon

Mahit Narayan: ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఇప్పుడు మన మధ్య లేరు. 2014లో 47 ఏళ్ల వయసులో చక్రి కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు ఇలా ఎన్నో మ్యూజికల్ హిట్ లను చక్రి అందించారు. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే చక్రి మరణం తర్వాత ఆయన కుటుంబంలో ఎన్నో ఆస్తిపరమైన ఇబ్బందులు మొదలయ్యాయి.

దీని గురించి ఎన్నో వదంతులు సోషల్ మీడియాలో కూడా రచ్చ చేశాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చక్రి సోదరుడు మహిత్ నారాయణ చక్రి మరణం తర్వాత ఆస్తి వివాదాల గురించి క్లారిటీ ఇచ్చారు. "అన్నయ్య (చక్రి) ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు మొదలయ్యాయి. ఒకవైపు అన్నయ్య లేడు అనే బాధకి తోడు ఈ గొడవల కారణంగా ప్రతిరోజు నరకం అనుభవించాము.

అన్నయ్య ఆస్తులలో కొన్నిటిని ఆయన భార్య అమ్మేసి అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడే ఇంకొక పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆమెతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మరికొన్ని ఆస్తులు కోర్టు కేసుల్లో ఉన్నాయి," అని మహిత్ నారాయణ పేర్కొన్నారు. అయితే చక్రి లానే మహిత్ నారాయణ కూడా మ్యూజిషియన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఈ మధ్యనే "పరారీ" అనే ఒక సినిమాకి మహిత్ సంగీతాన్ని కూడా అందించారు.

Tags:    

Similar News