ఒకప్పుడు స్టార్ నటి.. ఇప్పుడు రోడ్డు పక్కన దోసలు వేసుకుంటుంది
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అవును ఇది అక్షరాల నిజం మరి.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అవును ఇది అక్షరాల నిజం మరి. ఇక ఈ సామెత సినీ ఇండస్ట్రీలో వారికీ చక్కగా వర్తిస్తుంది కూడా.. స్టార్డం వచ్చినప్పుడే రెమ్యునరేషన్, అవకాశాలను అందిపుచ్చుకుంటారు సినీ తారాలు.. అవకశాలు లేనప్పుడు మాత్రం సినిమా పరిశ్రమలో సంపాదించుకున్న కొంత డబ్బుతో వ్యాపారం చేస్తూ ఉంటారు. మరికొందరు అవకాశాలు లేకా వక్రమార్గంలో వెళ్ళిన వారు ఉన్నారు. కానీ ఓ మలయాళ నటి దోసెలు అమ్ముకుంటుంది..
ఆమె పేరు కవితా లక్ష్మి.. మళయాళంలో సీరియల్ ఆర్టిస్టు ఈ కవిత. స్త్రీధనం అనే సీరియల్లో నెగటివ్ రోల్స్ పోషించిన ఈమే తక్కువ సమయంలోనే చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. సీరియల్స్ మాత్రమే కాకుండా ఆమె మమ్ముట్టి, మోహన్‌లాల్ మరియు మరెంతో మంది సూపర్ స్టార్స్‌తో కలిసి నటించింది. కానీ ఇప్పుడు ఆమెకి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అవకాశాలు వచ్చినప్పుడు పగలు సీరియల్స్ చేసుకుంటూ రాత్రి మాత్రం రోడ్డుపక్కన దోసలు వేసి డబ్బులు సంపాదించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటుంది . ఇంతకి ఆమెకి భర్త లేడా అన్న అనుమానం రావచ్చు.. అవును ఆమెకి ఒక్కప్పుడు భర్త ఉన్నాడు కానీ ఇద్దరు 13 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు.
ఇక తన ముగ్గురి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారికోసం పగలు,రాత్రి కష్టపడుతుంది. ప్రస్తుతం ఆమె ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటుంది. విలాసవంతమైన జీవితం కన్నా నా పిల్లలు వారి కాళ్లపై వారు నిలబడ్డం తనకీ ముఖ్యమని చెప్పుకొస్తుంది కవితా లక్ష్మి.. నన్ను నా పిల్లలని బతికించుకోవడానికి ఈ పని చేస్తున్నాను, ఇదేం తప్పు పని కాదు కదా అని అంటుంది కవితా లక్ష్మి... ఆత్మాభిమానంతో ఇలా కష్టపడుతున్న కవితా లక్ష్మిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో భాదపడుతునట్టు సమాచారం.