టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా ఈ నెల 9న భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. ఓపెనింగ్ రోజు నుంచి 'మహర్షి' సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటోంది ఇక కలెక్షన్ల పరంగా కూడా 'మహర్షి' సినిమా అంతంతమాత్రంగానే ఉందని చెప్పవచ్చు. కొన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్న 'మహర్షి' కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిరాశ కలిగిస్తుంది. నైజాం ప్రాంతంలో 20 కోట్ల షేర్ ను నమోదు చేసుకుంది 'మహర్షి'. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జోరు కనబరుస్తున్న మహర్షి కర్ణాటకలో సైతం మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది.
కానీ సీడెడ్ విషయానికి వస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్ 12 కోట్లు ఉండగా సినిమా మొదటి వారంలో 6.86 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఎలాంటి సినిమా అయినా రెండవ వారానికి వచ్చేసరికి కలెక్షన్లు తగ్గుతాయని తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఈ ప్రాంతంలో 'మహర్షి' సినిమా మహా అయితే ఎనిమిది కోట్ల వరకు వసూలు చేయగలదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఓవర్సీస్ లో సైతం 'మహర్షి' సినిమా బ్రేక్ ఈవెన్ సంపాదించడానికి 3.5 బిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా 1.6 మాత్రమే వసూలు చేయగలిగింది. మిగతా ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా 'మహర్షి' సినిమా సీడెడ్ మరియు ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్లకు నిరాశ కలిగించింది.