రూపాయి జీతం కూడా తీసుకోని ఏకైక ఎంపీ లతా మంగేష్కర్
Lata Mangeshkar Death: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Lata Mangeshkar Death: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్ 28 సెప్టెంబరు 1929లో జన్మించారు. గాయనిగా ఏడు దశాబ్ధాల ఆమె ప్రయాణం కొనసాగింది. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలకు పలు పురస్కారాలతో సత్కరించింది భారత ప్రభుత్వం. 1969లో పద్మ భూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న పురస్కారాలను అందుకున్నారు లతా మంగేష్కర్. 1989లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇవే కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం ''ది లీజియన్ ఆఫ్ హానర్' పురస్కారం కూడా పొందారు.
పద్మవిభూషణ్ అందుకున్న ఏడాదే ఆమెకు రాజ్యసభ సీటు లభించింది. సినీ ప్రియులను తన స్వరంతో అలరించిన లతా మంగేష్కర్‌కు తన సేవల్ని మరింత అందిచేందుకు ఎంపీగా అవకాశం ఇచ్చారు. అయితే అనారోగ్యం కారణంగా రాజ్యసభలో సమావేశాలకు హాజరు కాలేదు. కానీ అదే సమయంలో ఎంపీలుగా ఉన్న నేతలు ప్రణబ్ ముఖర్జీ, షబానా అజ్మీ, అప్పటి రాజ్యసభ ఉపాధ్యక్షులు నజ్మా హెప్తుల్లా వంటి వారు విమర్శించినా సున్నితంగా వ్యవహరించారు. తిరిగి వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా హుందాగా నడుచుకున్నారు. అప్పుడు ఇది చాలా వివాదాస్పదంగా మారింది, అయితే లతా దీదీ ఎంపీ పదవి ఎన్నడు ఎ విషయంలోనూ ఉపయోగించుకోలేదు. ఒక్క పైసా లేదా జీతం తీసుకోలేదు. ఇల్లు తీసుకోలేదు. 2005 కాశ్మీర్ భూకంపం సహాయం కోసం లతా మంగేష్కర్ భారీ డబ్బును విరాళంగా ఇచ్చారు.