Krishna Vamsi: "రంగమర్తాండ" తో కృష్ణవంశీ ఫామ్ లోకి వచ్చినట్టేనా?

Krishna Vamsi: ఇకనైనా కృష్ణవంశీ బిజీ అవుతారా?

Update: 2023-03-24 15:00 GMT
Krishna Vamsi Came Into Form With Ranga Maarthaanda

Krishna Vamsi: "రంగమర్తాండ" తో కృష్ణవంశీ ఫామ్ లోకి వచ్చినట్టేనా? 

  • whatsapp icon

Krishna Vamsi: క్రియేటివ్ డైరెక్టర్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చే పేరు కృష్ణవంశీ. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి దర్శకత్వం వహించిన కృష్ణవంశీ గత కొద్ది రోజులుగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. తాజాగా ఇప్పుడు కృష్ణవంశీ "రంగమార్తాండ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మరాఠీలో సూపర్ హిట్ అయిన "నట సామ్రాట్" సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణలు ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను కూడా అందుకుంటుంది. మొదటి రోజు నుంచి ఈ సినిమాకి చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. తగిన ఫలితం దక్కడంతో చిత్ర బృందం కూడా ఆనందంలో మునిగితేలుతోంది. అయితే కమర్షియల్ గా ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా సక్సెస్ అవడంతో కృష్ణవంశీ ప్రస్తుతానికి సెలబ్రేషన్స్ మోడ్ లో ఉన్నారు. ప్రకాష్ రాజ్ తనకి అప్పగించిన బాధ్యతను దిగ్విజయంగా పూర్తి చేసి రిలాక్స్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఎలాగో సక్సెస్ అయింది. ఇప్పటికైనా కృష్ణవంశీని ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు నమ్ముతారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

ఎప్పుడో విడుదల అయిన "చందమామ" సినిమా తర్వాత కృష్ణ వంశీ కృష్ణవంశీ ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. ఆ తరువాత "గోవిందుడు అందరివాడేలే", "నక్షత్రం" వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. కానీ ఇప్పుడు "రంగమార్తాండ" సినిమాతో కృష్ణవంశీ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టే కనిపిస్తున్నారు. మరి ఇకనైనా కృష్ణవంశీ వరుస సినిమాలతో బిజీ అవుతారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News