మూడు నెలల్లో 43 సినిమాలు రిలీజ్.. ఏది హిట్టు..? ఏది ఫట్టు..?

Telugu Movies 2021: గత ఏడాది కరోనా వైరస్ కారణంగా తెలుగు సినిమా విడుదలకు నోచుకోలేదు.

Update: 2021-04-03 12:00 GMT

Telugu Movies List 2021

Telugu Movies 2021: గత ఏడాది కరోనా వైరస్ కారణంగా తెలుగు సినిమా విడుదలకు నోచుకోలేదు. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇక ఏడాది పరిస్థితులు కుదుట పడటంతో మళ్లి సినిమాలు విడుదల ఊపందుకున్నాయి. అయితే మొదటి నెల 50శాతం అక్యూపెన్సీతో విడుదల అయిన సినిమాలు, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పూర్తి సడలింపులతో థియేటర్లు అన్ని ఫూల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో సినిమాల విడుదల ఊపందుకున్నాయి. కాకపోతే సినిమాలు విడుదల అయినా మళ్లీ కరోనా ఉదృతి కొనసాగడంతో ప్రేక్షకులు మాత్రం థియేటర్ల వైపు పూర్తిస్థాయిలో మొగ్గుచూపలేదు.

మరోవైపు ఓటీటీలు కూడా థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి కారణం అని చెప్పొచ్చు. గత ఏడాది సినిమాలు నిలిచిపోయినా.. ప్రేక్షకులను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మంచి కాలక్షేపం కలిగించింది. ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు, పలు రకాల ప్రోగ్రాంలు ఉండడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీల వైపు మళ్లింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు భారీ సంఖ్యలో సినిమా హాళ్ల వైపు వెళ్లలేదు. ఇక  సినిమాలు విడుదల అయిన రెండు వారాలకే ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ల్లో ప్రత్యక్షమవడం ఒక కారణంగా చెప్పోచ్చు.

కాగా..గత మూడు నెలలుగా పెద్ద చిన్ని సినిమాలు కలిపి టాలీవుడ్‌లో 43 చిత్రాలు విడుదల అయ్యాయి. దాదాపు 10 చిత్రాలు మాత్రమే అత్యధిక గ్రాస్ రాబట్టాయి. మిగిలిన చిత్రాలు మాత్రం నిరాశపరిచాయి. హిట్ చిత్రాల గురించి చెప్పుకుంటే అవి వేళ్లమీదే లెక్కపెట్టుకోవచ్చు. దాదాపు ఐదు సినిమాలు కూడా భారీ హిట్ సాధించలేకపోయాయి. అత్యధిక సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. అల్లరి నరేశ్, నితిన్ ఈ మూడు మాసాల్లో చెరో రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ అల్లరోడు నాంది చిత్రంలో చాలా కాలం తర్వాత హిట్ కొట్టాడు.

ఇక సంక్రాంతి బరిలోకి దిగిన పుంజుల్లో రవితేజ క్రాక్ సినిమా భారీ హిట్ సాధించింది. రామ్ రెడ్, బెల్లంకొండ శ్రీను అల్లుడు అదుర్స్ నిరాశపరిచాయి. బుల్లితెర యాంకర్‌ ప్రదీప్ హీరోగా వెండితెరపై అరంగేట్రం చేసిన చిత్రం 30రోజుల్లో ప్రేమించడం ఏలా?. ఈసినిమా పాటలు గత ఏడాది విడుదలై మంచి హిట్ సాధించాయి. సినిమాలో దమ్ములేకపోవడంతో 30రోజుల్లో ప్రేమించడం ఏలా? అనేది ప్రేక్షకులు నేర్చుకోవడం కష్టమైంది.

గత ఏడాది ఫిబ్రవరిలో భీష్మతో హిట్ ఇచ్చిన నితిన్.. ఫిబ్రవరి సెంటిమెంట్ తో మళ్లి చెక్ సినిమాతో వచ్చాడు. అయితే చెక్ సినిమా నితిన్ ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. నితిన్, కీర్తి సురేశ్ జంటగా వచ్చిన చిత్రం రంగ్ దే పర్వాలేదనిపించింది. ఇక అల్లరి నరేశ్ బంగారు బుల్లోడు అంటూ బాలయ్య సూపర్ హిట్ మూవీ టైటిల్, సాంగ్ రీమిక్స్ చేసుకోని మరి వచ్చాడు. అయితే ప్రేక్షకులు మాత్రం ఈ బుల్లోడిని పట్టించుకోలేదు. ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే పట్టుదలలో వెంటనే నాంది అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సెక్షన్ 211 అనే పాయింట్ కొత్తగా ట్రై చేశాడు. విభిన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. అల్లరి నరేశ్ కు దాదాపు ఏడేళ్ల తర్వాత హిట్ ఇచ్చారు.

ఇక మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ఉప్పెన.. గత సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోయింది. ఈ చిత్రంలో హీరోగా తెరంగేట్రం చేసిన వైష్ణవ్ తేజ్ కి మంచి మార్కులే పడ్డాయి. ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టికి అవకాశాలు తన్నుకొచ్చాయి. ఇంద్ర,సాంబ సినిమా ఫేమ్ తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతూ.. జాంబీ జోనర్లో వచ్చిన చిత్రం జాంబీ రెడ్డి హిట్ కొట్టింది. ఆదే జాంబీ జోనర్ లో వచ్చిన జీ జాంబీ చిత్రం అడ్రస్ కూడా లేదు. శర్వానంద్ శ్రీకారం సినిమా పర్వాలేదనిపించింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో చూపించాలనే పట్టుదలతో కనిపించినా.. కథనంతో కొత్తదనం లేకపోవడం ప్రేక్షకులు ఇబ్బంది పెట్టింది. 'జాతిరత్నాలు'.. 'శ్రీకారం'ను పెద్ద దెబ్బే కొట్టింది.

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన జాతిరత్నాలు థీయేటర్లో నవ్వులపూలు పూయించింది. చిన్నా సినిమా అయినా మార్చిలో పెద్ద హిట్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నిర్మాతకు కాసుల పంట పండించింది. ఓవర్సీస్ లోనూ భారీ ఎత్తున కలెక్షన్లు రాబట్టి పెద్ద హీరోల చిత్రాల సరసన నిలిచింది. గాలిసంపత్ పర్వాలేదనిపించినా రత్నాల ముందు నిలువలేకపోయింది. వారంలోనే ధియేటర్లో నుంచి ఓటీటీలో రిలీజై సెన్సేషన్ సృష్టించింది. కాజల్ అగర్వాల్, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో వచ్చిన మోసగాళ్లు భారీ లాస్ మిగిల్చింది. ప్యాన్ ఇండియా మూవీగా తెరక్కెక్కిన ఈ సినిమా పెద్దగా డిజాస్టర్ గా మిగిలింది.

సాయి కూమార్ తనయుడు ఆది  హీరోగా వచ్చిన సినిమా శశి. ఈ  చిత్రం ఎప్పుడు వచ్చిపోయిందో ఎవరికీ తెలియదు. సుమంత్ కపటధారి, నందినీశ్వేత అక్షర, సందీప్ కిషన్,లావణ్య త్రిపాఠిల ఏ1 ఎక్స్ ప్రెస్, సాగర్ ఆర్కే నాయుడు షాదీ ముబారక్, కార్తికేయ, లావణ్య త్రిపాఠిల చావుకబురు చల్లగా , శ్రీసింహా తెల్లవారితే గురువారం, రానా అరణ‌్య, జగపతి బాబు fcuk, చెప్పినా ఎవరు నమ్మరు, ఏప్రిల్ 28 ఏం జరిగింది, టైమ్ ట్రావెల్ చిత్రం ప్లేబ్యాక్, పవర్ ప్లే, నిన్నిలా-నిన్నిలా, A, కళాపోషకులు, శ్రీకాంత్, సూనీల్, తారక్ రత్నాలా జైసేన, Mr & Miss, అన్నపూర్ణమ్మగారి మనవడు చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. కింగ్ నాగార్జున ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడం కొత్తమేకాదు. నాగ్ హీరోగా వైవిద్యభరిత పాత్రలో రూపొందిన చిత్రం 'వైల్డ్ డాగ్'. ఏప్రిల్ 2 విడుదల అయిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

సూపర్ ఓవర్, సైకిల్, లైవ్ టెలికాస్ట్, మైల్, పిట్టకథలు సినిమాలు ఓటీటీల్లో ప్రత్యక్షమైయ్యాయి. ఈ మూడు మాసాల్లో అత్యథిక గ్రాస్ రాబట్టిన సినిమాల్లో ఉప్పెన ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. తర్వాత జాతిరత్నాలు, క్రాక్, రెడ్, రంగ్ దే, శ్రీకారం, జాంబిరెడ్డి నిలిచాయి. వైల్డ్ డాగ్ మూవీ రిపోర్ట్ రావల్సివుంది. తెలుగులో డబ్బింగ్ అయిన చిత్రాలు విజయ్ మాస్టర్, పొగరు, యువరత్నా, రాబర్ట్, సూల్తాన్ చిత్రాలు పెద్దగా విజయాన్ని అందుకోలేదు.

Tags:    

Similar News