HIT 3: హిట్‌3 నుంచి సర్‌ప్రైజ్‌ లీక్‌.. స్పందించిన దర్శకుడు, ఎమోషనల్ పోస్ట్‌

HIT 3: నాని హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో హిట్‌3 అనే మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

Update: 2025-04-09 07:02 GMT
HIT 3: హిట్‌3 నుంచి సర్‌ప్రైజ్‌ లీక్‌.. స్పందించిన దర్శకుడు, ఎమోషనల్ పోస్ట్‌
  • whatsapp icon

HIT 3: నాని హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో హిట్‌3 అనే మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాని ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిట్‌ ఫ్రాంచైజీలో భాగంగా వస్తోన్న మూడో సినిమా ఇది. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్‌ సినిమాపై ఒక్కసారిగా హైప్‌ను క్రియేట్‌ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు లీక్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కార్తీ కూడా కనిపించనున్నాడని, హిట్‌4లో హీరోగా నటించబోయేది కార్తీ అనేది ఈ వార్త సారాంశం. అయితే ఈ విషయాన్ని సినిమా చివరి వరకు సీక్రెట్‌గా ఉంచాలనుకున్న చిత్ర యూనిట్‌ ఈ లీక్‌తో నిరాశకు గురైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శకుడు శైలేష్‌ కొలను ఈ విషయమై ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ఈ విషయంపై దర్శకుడు స్పందిస్తూ.. "థియేటర్లో ప్రేక్షకులు ఆనందించే ఒక్కో క్షణం కోసం ఓ పెద్ద బృందం రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడుతుంది. వాళ్లంతా తమ సామర్థ్యాన్ని మించిపోయేలా పని చేస్తారు. ఈ మొత్తం ప్రయాణం ఒక్కో ఫ్రేమ్‌ను అద్భుతంగా చూపించేందుకు మాత్రమే" అంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి లీక్‌పై సోషల్ మీడియా, మీడియాను తప్పుబట్టడం సరి కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పలు సందర్భాల్లో మేకర్స్‌ స్వయంగా లీక్స్‌ను ప్రేరేపించి సినిమాపై బజ్‌ క్రియేట్ చేసిన ఉదాహరణలు ఉన్నాయి. రిలీజ్ ఆలస్యం అవుతున్న సినిమాల్ని మరిచిపోకుండా ఉంచేందుకు కావాలనే లీక్స్‌ను వదిలే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే శైలేష్‌ స్పందించిన తీరు చూస్తుంటే ఈ లీక్‌ పొరపాటున జరిగిందిలా అనిపించడం లేదు.

ఇదిలా ఉంటే శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన హిట్‌: ది థర్డ్‌ కేస్‌ షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను మే 1వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News