Prabhas: అసలు రాజాసాబ్‌ పరిస్థితి ఏంటి.? క్లారిటీ ఇచ్చిన మారుతి, ఏమన్నారంటే

Update: 2025-04-09 06:00 GMT
Prabhas: అసలు రాజాసాబ్‌ పరిస్థితి ఏంటి.? క్లారిటీ ఇచ్చిన మారుతి, ఏమన్నారంటే
  • whatsapp icon

ప్రస్తుతం ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. బాహుబలి, కల్కి, సలార్‌తో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు. దీంతో ప్రభాస్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్‌ ముందు మరో రూ. వెయ్యి కోట్ల సినిమా కాన్ఫాన్‌ అని అంతా అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విజయాల తర్వాత ప్రభాస్‌ సైతం సినిమాల్లో వేగాన్ని పెంచారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రాల్లో ది రాజాసాబ్‌ ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మొదటి హారర్ కామెడీ మూవీగా రూపొందుతోంది. హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అనుభవం ఉన్న మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఈ తరహా సినిమా రాబోతోందన్న విషయం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.

ఇటీవల మారుతి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని, "మీకు పూర్తి సంతృప్తి కలిగినప్పుడే సినిమా రిలీజ్ చేయండి. కావలసినంత సమయం తీసుకోండి. నవంబర్ అయినా, వచ్చే సంవత్సరం అయినా మేం ఎదురు చూస్తాం. కానీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వండి. అప్పుడు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టం," అని కోరాడు.

దీనిపై స్పందించిన మారుతి, "ఇంకా కొంత టాకీ పార్ట్‌ మిగిలి ఉంది. అలాగే కొన్ని పాటల షూటింగ్ పూర్తవ్వాల్సి ఉంది. అవి అయిపోగానే లిరికల్ వీడియోలు విడుదల చేస్తాం. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ కీలకం. ఇప్పటికే పలు సీజీఐ స్టూడియోలు పని చేస్తున్నాయి. కొన్నింటి అవుట్‌పుట్ మంచి రిజల్ట్ ఇస్తోంది. ఈ ప్రాసెస్‌లో ఎన్నో అంశాలు సంబంధించి సమన్వయం అవసరం. ఇది ఒక్కరే పూర్తిచేయగలిగే పని కాదు. అందుకే కొంత సమయం పడుతోంది. సీజీ వర్క్ పూర్తైన వెంటనే నిర్మాతలు రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి అందరం శ్రమిస్తున్నాం. కాస్త ఓపికతో ఉండండి," అని చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News