Chiranjeevi: పవన్ కుమారుడిని చూసేందుకు సింగపూర్ వెళ్లిన చిరంజీవి దంపతులు

Chiranjeevi: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మార్క్ ను చూసేందుకు పవన్ కల్యాణ్ తోపాటు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. హైదరాబాద్ విమానాశ్రయంలో పవన్ , చిరంజీవ, సురేఖ కనిపించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.
కాగా మార్క్ శంకర్ కు గాయాలు కావడంపై పవన్ స్పందించారు. సమ్మర్ క్యాంప్ లో అగ్నిప్రమాదం జరిగి నా కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగచేరింది. అగ్నిప్రమాదం చిన్నదే అనుకున్నా..తర్వాత దాని తీవ్రత తెలిసింది. నా పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగడం చాలా బాధాకరం. వైద్యులు చికిత్స అందిస్తున్నారని..ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారని తెలిపారు.