అందుకే సోషల్ మీడియా కి నిహారిక దూరంగా ఉంటుందా?

అందుకే సోషల్ మీడియా కి నిహారిక దూరంగా ఉంటుందా?

Update: 2022-03-14 09:30 GMT

 అందుకే సోషల్ మీడియా కి నిహారిక దూరంగా ఉంటుందా?

Chaitanya Jonnalagadda: ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఇంస్టాగ్రామ్ లో పేర్లను మార్చి తర్వాత తమ డివర్స్ ప్రకటించటం లాంటివి చేస్తున్నారు. ఉదాహరణకి సమంత కూడా నాగచైతన్యతో విడాకుల గురించి ప్రకటించే ముందు ఇన్స్టాగ్రామ్ లో తన పేరుని సమంత అక్కినేని నుంచి సమంత గా మార్చుకుంది. ఇక తాజాగా మెగా హీరోయిన్ నిహారిక 2020 డిసెంబర్ లో చైతన్య జొన్నలగడ్డ తో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిహారిక ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని డి ఆక్టివేట్ చేసింది. ఈ నేపథ్యంలో అభిమానులు నిహారిక కూడా త్వరలో తన విడాకులు వెల్లడిస్తుంది ఏమోనని కంగారుపడుతున్నారు అభిమానులు.

కానీ ఈ పుకార్లు కి చెక్ పెడుతూ నిహారిక భర్త చైతన్య నిహారిక ఫోటోని షేర్ చేశారు. "కొత్త వీల్ తీసుకున్నందుకు ఎంత ఆనందంగా, ఎగ్జైటింగ్ గా ఉందో చూడండి. ఇప్పుడు ఇల్లంతా మెస్సీ చేయబోతోంది" అంటూ నిహారిక పోటరీ నేర్చుకుంటున్న ఫోటోను షేర్ చేశాడు చైతన్య. ఇక సోషల్ మీడియా లో ఉండే ట్రోల్స్ కి దూరంగా ఉందామనే నిహారిక తన అకౌంట్ ని డీయాక్టివేట్ చేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా వెండి తెరకు దూరంగా ఉంటున్న నిహారిక త్వరలోనే నిర్మాతగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Tags:    

Similar News