Manchu Mohan Babu: మోహన్​ బాబుపై కేసు నమోదు

Update: 2024-12-11 03:45 GMT

Manchu Mohan Babu: ప్రముఖ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై కేసు నమోదు అయ్యింది. మీడియా ప్రతినిధులపై దాడి ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. మోహన్ బాబుపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద పహాడీ షరీఫ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. మోహన్ బాబు, మంచు మనోజ్ ల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో వివాదాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. 

మోహన్ బాబు కుటుంబంలో వివాదం నేపథ్యంలో మంగళవారం మీడియా ప్రతినిథులు జల్ పల్లిలో మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబుతోపాటు వచ్చిన బౌన్సర్లు, సిబ్బంది..గేటులోపల ఉన్న మీడియా ప్రతినిథులను బయటకు తోసేశారు. అంతేకాదు కర్రలతో మీడియా ప్రతినిథులపై దాడికి పాల్పడ్డారు. ఓ ఛానెల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైకును లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేశారు. దీంతో ఓ ఛానెల్ కెమెరామెన్ కిందపడ్డారు. దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి ధర్నాకు దిగారు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో పోలీసులు మోహన్ బాబుపై కేసు ఫైల్ చేశారు. 

Tags:    

Similar News