Bigg Boss 5 Promo: ఆటలో అప్పడం.. సన్నీ, షణ్ముఖ్ లో తప్పెవరిది..??

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గురువారం(12/11/2021) ప్రోమో విడుదల

Update: 2021-11-12 09:32 GMT
Bigg Boss Telugu 5 Friday Episode Promo Released Today 12th November 2021 | Bigg Boss 5 Updates

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

  • whatsapp icon

Bigg Boss 5 Latest Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 శుక్రవారం ప్రోమో బిగ్ బాస్ హౌస్ లో హీట్ పుట్టించింది.. కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ఇచ్చిన "టవర్ లో ఉంది పవర్" టాస్క్ లో భాగంగా ఏ పోటీదారుడు అయితే వారి టవర్ ని కాపాడుకుంటాడో వారే ఈవారం కెప్టెన్ గా నిలుస్తాడని బిగ్ బాస్ నియమాన్ని పెట్టినట్లుగా తాజా ప్రోమో చూస్తే అర్ధమవుతుంది..

ఈ టాస్క్ లో భాగంగా సిరి హనుమంత్, విజే సన్నీ, రవి, అర్జె కాజల్ కెప్టెన్సీ పోటీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే బాల్స్ తో ఇతర ఇంటి సభ్యుడి టవర్ ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్న సన్నీని సిరి హనుమంత్ అడ్డుకోవడంతో అలా ఆపడం రూల్ కాదని నేను కూడా పోటీదారుడి నేనని కోపానికి రావడం చూశాము.. అయితే సన్నీ ఆవేశంలో ఇంకోసారి వస్తే అప్పడం అవుతావని సిరి హనుమంత్ ని అనడంతో షణ్ముఖ్ జస్వంత్ మధ్యలో మాట్లాడటంతో సన్నీ ఒక్కసారిగా షణ్ముఖ్ జస్వంత్ పై సీరియస్ అవడం తాజా ప్రోమోలో చూశాము.

ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో పాటు రా చూసుకుందాం అనే వరకు వీరి గొడవ జరిగింది. ఆడపిల్లని పంపి నువ్వు మాట్లాడటం ఏంటి అని షణ్ముఖ్ పై సీరియస్ అవుతాడు సన్నీ. అయితే బిగ్ బాస్ పెట్టిన నియమాలకు వ్యతిరేకంగా సన్నీని సిరి హనుమంత్ అడ్డుకుందా..?? అందుకే సన్నీ అప్పడం అయిపోతావని, తంతా అని అన్నాడా..?? తంతా అని అన్నది టవర్ నా లేదా వ్యక్తి నా అనేది ఈరోజు ఎపిసోడ్ లో క్లారిటీ రానుంది.. ఇక ఇప్పటివరకు గొడవ జరిగిన సందర్భాల్లో సన్నీ తప్పు లేకపోయినా.. మరి ఈరోజు షణ్ముఖ్ జస్వంత్ పై అంత సీరియస్ అవడానికి కారణం ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది.

Full View


Tags:    

Similar News