Bigg Boss 9 Telugu: ఈసారి బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున కాదా.? మరో సీనియర్ హీరోతో రేప్లేస్
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Bigg Boss 9 Telugu: ఈసారి బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున కాదా.? మరో సీనియర్ హీరోతో రేప్లేస్
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ షోకు మంచి ఆదరణ ఉంది. దేశంలో దాదాపు అన్ని ప్రముఖ భాషల్లో టెలికాస్ట్ అవుతోన్న ఈ షోకి భారీగా టీఆర్‌పీ రేటింగ్‌లు లభిస్తుంటాయి. ఇక తెలుగు విషయానికొస్తే ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తయ్యాయి. తొలి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించగా ఆ తర్వాత నాని హోస్ట్‌గా చేశారు
ఇక ఆ తర్వాతి నుంచి నాగార్జుననే షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఎండెమాల్ షైన్ సంస్థ ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఈసారి బిగ్‌బాస్‌కి సంబంధించి ఒక కీలక మార్పు చర్చకు వస్తోంది. అదేంటి అంటే, హోస్ట్ మార్పు.
ఇప్పటివరకు బిగ్‌బాస్‌ను హోస్ట్ చేసిన నటుడు అక్కినేని నాగార్జునపై గత సీజన్‌లో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఎనిమిదో సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవటానికి కొన్ని అంశాలు కారణమయ్యాయి. ముఖ్యంగా పార్టిసిపెంట్ల సెలెక్షన్‌తో పాటు, నాగార్జున యాంకరింగ్ పద్దతిపై కూడా విమర్శలు వచ్చాయి. "సాఫ్ట్‌గా వ్యవహరించారు", "గేమ్ మీద పట్టున్నట్టు అనిపించలేదు" అనే అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా వినిపించాయి.
ఈ నేపథ్యంలో, బిగ్‌బాస్ 9కి కొత్త హోస్ట్‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయన, బుల్లితెరపై గట్టి ప్రభావం చూపించగలిగారు. దీనివల్లే ఆయన్ని బిగ్‌బాస్ హోస్ట్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య ప్రస్తుతం సినిమాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో, ఆయన ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారో లేదో అనే ప్రశ్న సమాధానంగా మారనుంది.
కానీ బిగ్‌బాస్ యూనిట్ మాత్రం ఈ సీజన్‌ను మునుపటిలా కాకుండా కొత్తదనంతో, ఎక్కువ ఎంటర్టైన్మెంట్‌తో నింపే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, బిగ్‌బాస్ తెలుగు 9 ఎప్పుడు ప్రారంభమవుతుందో, హోస్ట్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.