
మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. సెలబ్రిటీ కుటుంబాల్లో కూడా క్యాన్సర్ కామన్‌గా మారింది. తాజాగా ఓ హీరోయిన్ తండ్రి కూడా క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఎవరా హీరోయిన్.? ఏమైందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
నటి పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన కుటుంబంలో జరిగిన విషాదాన్ని అభిమానులతో పంచుకుంది. తన తండ్రికి క్యాన్సర్ వచ్చిందని, చికిత్స ప్రారంభమైనట్లు తెలిపింది. ఏప్రిల్ 8న కీమోథెరపీ మొదలైనట్లు చెప్పిన పాయల్, ఈ సమయంలో అందరి ప్రేమ, మద్దతు, పాజిటివ్ ఎనర్జీ అవసరమని పేర్కొంది. తన తండ్రి చాలా బలంగా ఉన్నారని, ఆయన త్వరగా కోలుకోవాలనే ఆశతో ముందుకెళ్తున్నామని చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ పోస్ట్‌కి హీరోయిన్లు సిమ్రత్ కౌర్, రాయ్ లక్ష్మి లాంటి తారలు స్పందించి ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెట్టారు. అలాగే అభిమానులూ ఆశీర్వాదాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం పాయల్ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ నటిగా తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇక పాయల్ కెరీర్ విషయానికొస్తే.. టాలీవుడ్‌కి RX100 సినిమాతో పరిచయమై, మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుందీ బ్యూటీ. అయితే ఆ తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేదని చెప్పాలి. కానీ చాలా రోజుల తర్వాత తనకు తొలి విజయాన్ని అందించిన అజయ్ భూపతి మంగళవారం సినిమాతో మరో హిట్‌ను అందించాడు. ప్రస్తుతం ఈ చిన్నది పలు సినిమాలతో బిజీగా ఉంది.