Mukhachitram: ముఖచిత్రం మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్..

Mukhachitram: ముఖ చిత్రం మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్..

Update: 2022-12-09 07:24 GMT

చిత్రం: ముఖచిత్రం

నటీనటులు: వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమని, విశ్వక్ సేన్, చైతన్య రావ్, అయేషా ఖాన్, సునీల్, రవి శంకర్, తదితరులు

సంగీతం: కాల భైరవ

సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బెజుగం

నిర్మాత: సందీప్ రాజ్

దర్శకత్వం: గంగాధర్

బ్యానర్: పాకెట్ మనీ పిక్చర్స్

విడుదల తేది: 09/12/2022

"కలర్ ఫోటో" సినిమాకి జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ రచయితగా ఇప్పుడు "ముఖచిత్రం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. యువ డైరెక్టర్ గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమని హీరో హీరోయిన్లుగా నటించగా విశ్వక్ సేన్ ఒక కీలక పాత్రలో కనిపించారు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా మంచి అంచనాల మధ్య ఇవాళ అనగా డిసెంబర్ 9న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూసేద్దామా..

కథ:

రాజ్ కుమార్ (వికాశ్ వశిష్ట) ఒక ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ తన తల్లి ఆక్సిడెంట్ లో తన అందాన్ని కోల్పోయి మానసికంగా కృంగిపోయి చనిపోతుంది. ఇలా ఇంక ఎవరికీ జరగకూడదు అని నిర్ణయించుకున్న రాజ్ కుమార్ ప్లాస్టిక్ సర్జన్ అవుతాడు. మహతి (ప్రియా వడ్లమని) అనే ఒక పల్లెటూరు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తన క్లాస్మేట్ మాయ (ఆయేషా ఖాన్) రాజ్ ను ప్రేమిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు మాయా కి ఆక్సిడెంట్ అయ్యి తన ముఖం చిధ్రమైపోతుంది. అదేరోజు మహతి కూడా ప్రాణాలు కోల్పోతుంది. దీంతో తనకి ఎంతో ఇష్టమైన భార్య ముఖాన్ని మాయా కి ప్లాస్టిక్ సర్జరీ చేసి మాయ ని మహతిగా మారుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మహతి ని నిజంగానే రాజ్ ప్రేమించాడా? రాజ్ గురించి మహతి రూపం లో ఉన్న మాయా ఎలాంటి నిజాలు తెలుసుకుంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

ఒక ప్లాస్టిక్ సర్జన్ పాత్రలో వికాస్ వశిష్ట చాలా బాగా నటించాడు. అతని పాత్రలో చాలానే వేరియేషన్స్ ఉన్నప్పటికీ వికాస్ వశిష్ట అన్నిటిని చాలా బాగా చూపించారు. విభిన్న పాత్రలో కనిపించిన వికాస్ వశిష్ట తన పాత్ర కి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. అతడి మిత్రుడి పాత్రలో చైతన్య రావు కూడా బాగానే నటించాడు. ఇక ప్రియా వడ్లమని నటన సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఆమె పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం నటనపరంగా అదరగొట్టిందని చెప్పుకోవాలి. ఆయేషా ఖాన్ కూడా మిగతా నటినటులతో పోటీపడి చాలా బాగా నటించారు. లాయర్ లుగా కనిపించిన రవిశంకర్ మరియు విశ్వక్ సేన్ కూడా కనిపించేది కొద్ది సేపే అయినప్పటికీ తమ పాత్రలలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే క్లైమాక్స్ సీన్ చాలా బాగుంటుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

సందీప్ రాజ్ అందించిన కథ నిజంగానే సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. డైలాగులు కూడా చాలా బాగున్నాయి. చాలా న్యాచురల్ గా కూడా అనిపిస్తాయి. ఇక కథని డైరెక్టర్ గంగాధర్ కూడా అంతే బాగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం కథలో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులకు ఎక్కడ బోరు కొట్టించకుండా చేస్తాయి. శ్రీనివాస్ బెజూగం సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. అతను అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక సినిమాలోని ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. రన్ టైం కూడా కేవలం రెండు గంటలే అవ్వటం సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చింది. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా ఎలివేట్ చేసింది.

బలాలు:

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే

రన్ టైం

నేపథ్య సంగీతం

బలహీనతలు:

ఫస్ట్ హాఫ్

చివరి మాట:

సినిమా చాలా నార్మల్ గా స్టార్ట్ అవుతుంది కానీ ప్రారంభం నుంచే దర్శకుడు పాత్రలపై క్యూరియాసిటీ పెరిగే విధంగానే కథను ముందుకు తీసుకువెళ్తారు. ప్రతి ఒక్క పాత్రకి ఒక సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అవుతుంది. ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ చాలా టైట్ గా ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ముఖ్యంగా డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో ఇచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా వీక్ గా ఉండటం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. క్లైమాక్స్ ట్విస్ట్ హై లైట్ ఉంటుంది. కానీ ఒక్క క్లైమాక్స్ కోసం గంటన్నర ల్యాగ్ ఉండే సన్నివేశాలు కొంత ఇరిటేట్ చేస్తాయి. ఓవరాల్ గా సినిమా ఒక సరి చూడదగ్గ మంచి క్రైమ్ థ్రిల్లర్.

బాటమ్ లైన్:

"ముఖ చిత్రం" ఒక సందేశం ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా.

Tags:    

Similar News