అయ్యో రామ రామ .... కథా విధేయత ఏది రామా!
తన అనాధ సోదరుల కొరకు తన విద్యను అన్నిటిని త్యాగం చేసే యువకుడి కథలా మొదలయ్యి.... డిష్యుం డిష్యుం డిష్యుం ... సినిమా అయిపోయిన కథ.
తన అనాధ సోదరుల కొరకు తన విద్యను అన్నిటిని త్యాగం చేసే యువకుడి కథలా మొదలయ్యి.... డిష్యుం డిష్యుం డిష్యుం ... సినిమా అయిపోయిన కథ. బోయపాటి ముందుగా భావావేశం నింపి ఆక్షన్ పంచటంతో ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చాడు, కాని ఈ సినిమాలో ఎలాంటి భావావేశం సగటు ప్రేక్షకునిలో పుట్టకముందే.... డిష్యుం డిష్యుం డిష్యుం అని కుమ్మేసాడు... దానితో ప్రేక్షకుడికి అర్ధంలేని ఆవేశంలా ఈ సినిమా అనిపిస్తుంది. హీరో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చేసిన అద్భుత నటన తర్వాత వచ్చిన సినిమా ఇది. కాని రామ్ చరణ్ కండలు, గుండెలు వున్నా ఈ సినిమా కథాత్మ లేక వట్టి శరీరంతో వున్నా సినిమా లా వుంది. ఈ యాక్షన్ సినిమాని చూసి రియాక్షన్ కావాలన్కుంటే మాత్రం....మీరు అయ్యో బోయా ఏంటి ఈ మాయ అని బయటికి వస్తారు. శ్రీ.కో.